Social Media Meet : సోషల్ మీడియా మీట్ తో పరువు పోయిందిగా..

Social Media Meet

Social Media Meet

Social Media Meet : వైసీపీ కోసం పనిచేస్తున్న సోషల్ మీడియా వారియర్లు తమ పరిస్థితిపై తామే జాలిపడుతున్నారు. జగన్ కోసం అంతగా పనిచేస్తే ఐదేళ్లలో తమను ఎవరూ పట్టించుకోలేదని బాధపడుతున్నారు. ఈక్రమంలో వారందరికీ భరోసా ఇప్పిస్తానంటూ సజ్జల పుత్రరత్నం.. సోషల్ మీడియా ఇన్ చార్జి ఓ సమావేశం పెట్టారు. జగన్ విశాఖలో ఉన్నారు కాబట్టి అందర్నీ అక్కడికే రమ్మన్నారు. అతి కష్టం మీద రెండు వందల మంది దాక వచ్చారు. మిగతా వారిని వైజాగ్ నుంచే సమీకరించారు. మొత్తం ఐదు వందల మంది దాక వచ్చారు కానీ ఒక్కరూ కూడా జగన్ చెప్పిన మాటలను వినలేదు..అలాగే వారు చెప్పిన మాటలను జగన్ వినలేదు.

వైజాగ్ లో రీల్స్ చేసుకునే ఓ అమ్మాయి జగన్ సంపాదనపై అబ్బురపడి అసలు ఆయన వ్యాపారాల కిటుకులెంటో తెలుసుకుందామని ప్రశ్నించింది. ఈ ప్రశ్నతో జగన్ మోహన్ రెడ్డికి మైండ్ బ్లాంక్ అయిందేమో కానీ ఆయన పట్టించుకోలేదు. కానీ సజ్జల భార్గవ మాత్రం జగణ్ రెడ్డి కంటే తానే తెలివైనవాడినని చెప్పుకునేందుకు తాపత్రయపడ్డారు. ఆయన చెప్పిన సమాధానమేంటంటే.. గూగుల్ లో చూసుకోమని. జగన్ గురించి గూగుల్ లో సెర్చ్ చేస్తే ఏమని వస్తుందో అందరికీ తెలుసు. అయినా కుమార సజ్జల అదే సలహా ఇచ్చి ఆ సోషల్ మీడియా సపోర్టర్ కు గొప్పగా సమాధానం ఇచ్చానని అనుకున్నారు.

గత ఎన్నికల సమయంలో వైసీపీ కోసం స్వచ్ఛందంగా పనిచేసిన వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు అధికారంలోకి వచ్చిన తర్వాత తాము చేసిన తప్పును తెలుసుకున్నారు. వారిలో 90 శాతం మంది సైలెంట్ అయిపోయారు. కొందరు పార్టీ మారారు. ఇక మిగిలింది పేమెంట్ బ్యాచ్ మాత్రమే. వారు కూడా సోషల్ మీడియాలో కొద్దిగా ఫాలోయింగ్ ఉన్నా.. అసభ్య వీడియోలు చేసే వారైనా సరే డీల్ మాట్లాడుకుని ప్రచారం చేయించుకుంటున్నారు. వైసీపీ సోషల్ మీడియా తాను ఓ డిజాస్టర్ గా మారడమే కాదు.. జగన్ మీటింగ్ ను కూడా అలాగే చేసిందన్న సెటైర్లు వినిపిస్తున్నాయి. ఎలా చూసినా జగన్ పని ఇక అయిపోయినట్టేనని అంటున్నారు.

TAGS