JAISW News Telugu

Narendra Modi : మూడోసారి హిందూత్వమే బీజేపీ ఎజెండా.. మోడీ మరోసారి ప్రధాని కానున్నారా!

Narendra Modi

Narendra Modi

Narendra Modi : ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారత్. ఐదేళ్లకోసారి వచ్చే పార్లమెంట్ ఎన్నికలు దేశ భవిష్యత్ ను నిర్ణయిస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ పదేళ్ల నుంచి జరుగుతున్న పరిణామాల దృష్ట్యా భారత్ విశ్వ గురువుగా మారేందుకు పావులు కదుపుకుంది. ప్రపంచంలో ఎలాంటి  విషయంలోనైనా స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలంటే భారత్ వైపు ఎదురు చూడాల్సిందే. అంతటి పూర్వ వైభవాన్ని భారత్ కు తీసుకువచ్చింది ప్రధాని నరేంద్ర మోడీ. రెండు దఫాలుగా అంటే పదేళ్లు దేశాన్ని ఎటువంటి ఆటంకం లేకుండా ఏలిన వ్యక్తి ప్రధాని నరేంద్ర మోడి. ఇప్పుడు మూడో దఫా ఎన్నికలకు వెళ్తున్నాడు.

మూడో సారి కూడా ప్రధానిగా ఎన్నికై చరిత్ర సృష్టించాలని మోడీ భావిస్తున్నారు. 370 సీట్లను సొంతంగా సాధించడం, ఎన్డీయేకు 400 సీట్లను గెలుచుకొని బీజేపీ చరిత్ర సృష్టిస్తుందని అమిత్‌ షా చెబుతున్నారు. ఇందుకు హిందూత్వ ఎజెండానే నమ్ముకున్నట్టు ఇటీవల వారి ప్రసంగాలు చెబుతున్నాయి. సౌత్ లోని తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులో జరిగిన సభలు, రోడ్‌ షోలలో మోడీ ప్రసంగిస్తూ హిందూ మతం అంతమే ప్రతిపక్షాల లక్ష్యమని చెప్పారు.

నెహ్రూ తరువాత మూడో సారి ప్రధాని పీఠాన్ని మోడీ అధిరోహించి రికార్డు సృష్టిస్తారని సర్వేలు సైతం చెప్తున్నాయి. బీజేపీ ఆది నుంచి అనుసరించే వ్యూహం హిందుత్వ ఎజెండా ఆ ఎజెండాపైనే మెజారిటీ ఓట్లు సొంత చేసుకోవాలని అనుకుంటుంది. దక్షిణాదిన మాత్రమే కాదు నార్త్ లో సైతం హిందూత్వ ఎజెండాను అమల్లో పెట్టి ఓట్లును తన ఖాతాలోకి మళ్లించుకోవాలని చూస్తోంది. దేశంలో రెండు జెండాలను తొలగించి ఒకే జెండా ఎగరాలని సంకల్పించి ఆర్టికల్‌ 370ని రద్దు చేయడం, త్రిపుల్ తలాక్ తో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ముస్లిం మహిళలకు రక్షణ కల్పించడం, 500 ఏళ్ల నిరీక్షణకు తొలగించి రాముడికి దివ్య భవ్య మందిరం కట్టడం వీటితో బీజేపీ ఖచ్చితంగా 370+ సీట్లు రాబట్టుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Exit mobile version