Salaar:సహజంగానే ఉత్తరాది దక్షిణాది అనే విభేధం ఎప్పుడూ బయటపడుతూనే ఉంటుంది. ఇటీవల సౌత్ స్టార్ల దూకుడు ముందు హిందీ సూపర్ స్టార్లు వెలవెలబోతున్నారు. కింగ్ ఖాన్ షారూఖ్ గ్రేట్ కంబ్యాక్ సాధ్యమైనా కానీ ఇప్పటికీ అభద్రతాభావంలో ఉన్నారనడానికి తాజాగా డంకీకి సాగుతున్న ప్రచారమే ఉదాహరణ. డంకీని మోసేందుకు సలార్ ని తగ్గించేందుకు చూస్తున్న బాలీవుడ్ స్వీయనిర్మిత క్రిటిక్స్, ట్రేడ్ అనలిస్టులు చేస్తున్న ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. ఇదో రకం ఉన్మాదం అని అంతా విశ్లేషిస్తున్నారు.
సలార్ కేవలం దక్షిణాదిలో మాత్రమే కాదు ఉత్తరాదినా భారీ ఓపెనింగులతో రికార్డులు సృష్టించేందుకు సిద్ధంగా ఉంది. ఇండియా బిగ్గెస్ట్ యాక్షన్ స్టార్ ప్రభాస్ సత్తా ఏమిటో ప్రపంచానికి మరోసారి తెలిసొచ్చే సమయమిది. సలార్ కేరళ -కర్ణాటక అడ్వాన్స్ టిక్కెట్ అమ్మకాలు ఇప్పటికే విధ్వంశంగా మారాయి. డే వన్ లో సలార్ రికార్డులు ఖాయమని తేలింది. అయితే కొంతమంది బాలీవుడ్ విశ్లేషకులు ఇప్పటికే షారుఖ్ ఖాన్ డుంకీని ఆకాశానికెత్తేస్తూ సలార్ ని విమర్శించడానికి ప్రయత్నించడం ఆశ్చర్యపరుస్తోంది.
ప్రముఖ బాలీవుడ్ ట్రేడ్ విశ్లేషకులు సలార్ రికార్డులను సీరియస్‌గా తీసుకోవద్దని హిందీ ప్రేక్షకులను హెచ్చరిస్తున్నారు. షారూఖ్ ఖాన్ సినిమా హిందీలో మాత్రమే విడుదల అవుతుంది కానీ ఇతర భాషల్లో విడుదల కాదంటూ సలార్ హిందీ వెర్షన్ కలెక్షన్‌ను మాత్రమే డుంకీతో పోల్చాలని వారు ప్రజలకు సలహా ఇస్తున్నారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ కలెక్షన్‌లను సలార్ హిందీ డేవన్ లో కలపకూడదని ప్రేక్షకులను కోరుతున్నారు.
అయితే ఈ ప్రచారం ఏదీ సలార్ భారీ ఓపెనింగ్ లను అడ్డుకోలేదని నిరూపణ అవుతోంది. బాలీవుడ్‌లో కింగ్ ఖాన్ కి ధీటుగా ప్రభాస్ ఓపెనింగులు తెచ్చే సత్తా ప్రభాస్ కి ఉంది. ఇప్పుడు హిందీ పరిశ్రమలో చాలా రికార్డులను సలార్ బ్రేక్ చేస్తుందని భావిస్తున్నారు.
పుష్ప- సాహో పైనా దుష్ప్రచారం:
నిజానికి ప్రభాస్ సినిమాపై దుష్ప్రచారం సాగించడం ఇప్పుడే చూస్తున్నది కాదు. అతడు నటించిన సాహో రిలీజ్ రోజున తీవ్ర వ్యతిరేక ప్రచారం సాగింది. సమీక్షకులు, ట్రేడ్ విశ్లేషకులు సాహోని డిజాస్టర్ అని ప్రకటించారు. కానీ ఈ భారీ యాక్షన్ సినిమా అత్యంత భారీ ఓపెనింగులతో హిందీ బెల్ట్ లో అదరగొట్టింది. ఇతర సౌత్ భాషల్లో కంటే హిందీ నుంచి భారీ వసూళ్లను సాధించింది. సాహో హిందీలో పెద్ద విజయం అందుకుంది.
ఇటీవల స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ నటించిన పుష్ప చిత్రంపైనా ఒక సెక్షన్ దుష్ప్రచారం చేసారు. ఆసక్తికరంగా పుష్ప హిందీ వెర్షన్ లో భారీ వసూళ్లను సాధించిందని, దక్షిణాదిన అంతంత మాత్రంగానే ఆడిందని కూడా బాలీవుడ్ క్రిటిక్స్ , ట్రేడ్ విశ్లేషకులు వ్యాఖ్యానించారు. నిజానికి దమ్మున్న కథ, దమ్మున్న హీరో నటిస్తే హిందీ ప్రేక్షకుల ఉత్తరాది, దక్షిణాది అని చూడరని నిరూపణ అయింది. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సలార్ తో రికార్డులు సృష్టించడం ఖాయం. మునుముందు పుష్ప 2తో బన్ని కూడా సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తాడని భావిస్తున్నారు.