Weather Forecast : తెలుగు రాష్ట్రాల్లో ఈ నెల 28న అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. మధ్యాహ్నం ఎండ తీవ్రత అధికంగా ఉంటుందని, రాత్రి వేడిగాలులు వీస్తాయని తెలిపింది. దక్షిణ తెలంగాణ, యానాం, రాయలసీమల్లో పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 5 డిగ్రీలు ఎక్కువగా (44 డిగ్రీలు) నమోదవుతుందని భారత వాతావరణ శాఖ పేర్కొంది.
తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతుండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. పలు జిల్లాల్లో వడగాల్పులు వీస్తున్నాయని హెచ్చరికలు జారీ చేసింది. తెలంగాణలోని నిర్మల్ జిల్లా నర్సాపూర్ లో అత్యధికంగా 43.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదయింది. ప్రజలు మధ్యాహ్న సమయంలో బయటకు రావద్దని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది.