Temperature Alert : రికార్డు స్థాయిలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదు

Temperature Alert
Temperature Alert : రాజస్థాన్ లోని చురులో మంగళవారం 50.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈ ఎండాకాలంలో ఇదే అత్యధిక ఉష్ణోగ్రత అని ప్రకటించింది. ఆ తర్వాత హరియాణాలోని సిర్సలో 50.3 డిగ్రీలు, ఢిల్లీలోని నరేళ్లలో 49.9 డిగ్రీలు, రాజస్థాన్ లోని గంగా నగర్ లో 49.4 డిగ్రీలు, ఫలోడిలో 49 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.
దేశంలోని పలు ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ఎండ వేడిమికి ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఎండలకు తోడు విపరీతమైన ఉక్కపోత కారణంగా ప్రజలు ఉక్కిరిబిక్కిరయ్యారు. ఉదయం 7 గంటల నుంచే సూర్యుడు తన ప్రతాపాన్ని చూపడంతో మధ్యాహ్నం 12 గంటలకే ప్రధాన రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. రాత్రి 8 గంటల వరకు కూడా వేడిగాలులు తగ్గలేదు.