CM Chandrababu : అచ్యుతాపురం ఘటనపై ఉన్నతస్థాయి కమిటీ : సీఎం చంద్రబాబు

CM Chandrababu : అచ్యుతాపురం ఫార్మా కంపెనీలో పేలుడు ఘటనపై ఉన్నతస్థాయి విచారణ కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. పరిశ్రమలో ఏం జరిగింది..? పరిశ్రమలో ఉన్న లోపాలపై ఈ కమిటీ విచారణ చేపడుతుందని తెలిపారు. పరిశ్రమలు ప్రజల భద్రతకు ప్రాధాన్యమివ్వాలని, భద్రత విషయంలో చర్యలు చేపట్టకపోతే ఇబ్బందులు ఏర్పడుతాయని వ్యాఖ్యానించారు.

అచ్యుతాపురం సెజ్ లో ఫార్మా పరిశ్రమను పరిశీలించిన అనంతరం సీఎం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. విశాఖలోని ఆసుపత్రుల్లో ఫార్మా కంపెనీ బాధితులను పరామర్శించాను, మృతులు, బాధితుల కుటుంబ సభ్యులను ఓదార్చానన్నారు. బాధితులను ఆదుకుంటామని, మృతుల కుటుంబాలకు కోటి రూపాయలు, తీవ్రంగా గాయపడిన వారికి 50 లక్షలు, స్వల్పంగా గాయపడిన వారికి 25 లక్షలు చొప్పున అధికారులు చెక్కులు అందజేస్తారని తెలిపారు.

TAGS