CM Siddaramaiah : సీఎం సిద్దరామయ్యకు హైకోర్టు షాక్.. ముడాస్కాం కేసులో విచారణ చేయాలి

CM Siddaramaiah

CM Siddaramaiah

CM Siddaramaiah : ముడా భూ కుంభకోణంలో కర్ణాటక సీఎం సిద్దరామయ్యకు హైకోర్టులో గట్టి షాక్ తగిలింది. ఈ కేసులో గవర్నర్ పై ఆయన పిటిషన్ ను కర్ణాటక హైకోర్టు తిరస్కరించింది. పిటిషన్ లో పేర్కొన్న వాస్తవాలపై దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని హైకోర్టు తెలిపింది. గవర్నర్ తన అధికారాన్ని ఉపయోగించి స్వతంత్రంగా దర్యాప్తునకు అనుమతిని ఇవ్వడంలో తప్పు లేదని కర్ణాటక హైకోర్టులో సీఎం సిద్దరామయ్య దాఖలు చేసిన పిటిషన్ ను జస్టిస్ ఎం.నాగప్రసన్న తోసిపుచ్చారు. ఫిర్యాదులలో వివరించిన వాస్తవాలు నిస్సందేహంగా దర్యాప్తు అవసరమని కోర్టు తెలిపింది. సీఎం సిద్దరామయ్యపై దర్యాప్తునకు అనుమతిని మంజూరు చేసింది.

మైసూరు అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ (ముడా) స్థలాల కేటాయింపులో జరిగిన అక్రమాలకు సంబంధించి, సిద్దరామయ్య భార్యకు ఇందులో అక్రమంగా భూములు కేటాయించారని తనపై దర్యాప్తునకు గవర్నర్ ధావర్ చంద్ గెహ్లాట్ అనుమతిచ్చారు. గవర్నర్ ను సవాల్ చేస్తూ సీఎం సిద్దరామయ్య దాఖలు చేసిన పిటిషన్ పై కర్ణాటక హైకోర్టు తన తీర్పును వెలువరించింది.

TAGS