Ex CM Jagan : మాజీ సీఎం జగన్ కేసుల పిటిషన్ పై తెలంగాణ హైకోర్టులో విచారణ చేసింది. సీబీఐ కోర్టులో ఉన్న జగన్ కేసులను రోజువారీ విచారణకు హైకోర్టు ఆదేశించింది. ఏపీ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. జగన్ పై ఉన్న కేసుల గురించి దాఖలైన పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టింది. సీబీఐ కోర్టులో ఉన్న జగన్ కేసులను రోజువారీగా విచారించాలని ఆదేశాలు జారీ చేసింది.
జగన్ కేసులపై గతంలో హరిరామ జోగయ్య హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై వాదనలు వినిపించిన ప్రభుత్వ న్యాయవాది కోర్టులో దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు. దీనపై ఇప్పటికే ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసింది. ఈ నేపథ్యంలో తదుపరి విచారణను తెలంగాణ ధర్మాసనం 3 వారాలకు వాయిదా వేసింది.