high blood pressure:వామ్మో బీపీ..జర బీ కేర్ ఫుల్!

high blood pressure:ఉరుకుల పరుగుల జీవితంలో భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగాలు చేయాల్సిన పరిస్థితి. లేస్తూనే ఆఫీసు పనుల్లో నిమగ్నమవ్వడం, ఇంటికి వస్తూనే ఇతర పనులతో బిజీగా అవ్వడం సర్వ సాధారణంగా మారింది. అయితే మారుతున్న జీవన శైలి కారణంగా మనుషుల రోజువారి దినచర్య కూడా మారుతోంది. ఫలితంగా రోగాల బారిన పడుతున్నారు. గుండె సమస్యలు, బరువు పెరగడం, ఇతర సమస్యలతో బాధపడుతున్నారు. అయితే గజిబిజి లైఫ్ కారణంగా భార్యాభర్తలు బీపీ సమస్యతో బాధపడుతున్నారట. ఎక్కువ మంది వ్యక్తులు రక్తపోటుతో ఆస్పత్రుల పాలవుతున్నట్టు వివిధ సర్వేలు కూడా హెచ్చరిస్తున్నాయి.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న జంటల్లో ఎక్కువ శాతం మందికి బీపీ ఉందని ఓ అధ్యయనంలో స్పష్టమైంది. దిగ్భ్రాంతికరమైన విషయం ఏమిటంటే.. జంటలో ఒక వ్యక్తికి బీపీ ఉంటే, మరొకరిపై ఎఫెక్ట్ పడుతుందట. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ జర్నల్‌లో ఈ విషయం స్పష్టంమైంది. జంటలో ఒకరికి బిపి వస్తే మరొకరికి కూడా అది వస్తుందని పేర్కొంది. సాధారణంగా, మధ్య వయస్కులు, వృద్ధులలో BP ఉంటుందని, కానీ భార్య, భర్తకు కూడా BP ఉందని అధ్యయనం కనుగొంది. US, ఇంగ్లాండ్, చైనా మరియు భారతదేశంలోని చాలా జంటలు కూడా ఇదే సమస్యను ఎదుర్కొంటున్నాయ‌ని స్పష్టమైంది కూడా.

చైనా, భారతదేశంలో ఈ సమస్య ఎక్కువగా ఉందని , ఈ దేశాలలోని కుటుంబ నిర్మాణమే దీనికి కారణమని నిపుణులు చెప్పారు. “ప్రజలు ఇక్కడ కుటుంబ నిర్మాణాన్ని నమ్ముతారు. కలిసి జీవించడానికి ఇష్టపడతారు. దంపతుల సంభాషణలు, జీవనశైలి ఇందులో కీలకపాత్ర పోషిస్తాయి. ఇంగ్లండ్‌లో 47 శాతం జంటలకు BP ఉంది, US (37.9%), చైనా (20.8%), మరియు భారతదేశం (19.8%) శాతంతో బాధపడుతున్నారు ”అని ఎక్స్ పర్ట్స్ తేల్చి చెప్పారు.

TAGS