Hi Nanna on Netflix : గ్లోబల్ వైడ్ గా నెట్ ఫ్లిక్స్ లో ‘హాయ్ నాన్న’ ప్రభంజనం..#RRR రికార్డు డేంజర్ లో ఉందా?
Hi Nanna on Netflix : న్యాచురల్ స్టార్ నాని కి ప్రస్తుతం మహర్దశ నడుస్తుంది. గత ఏడాది ప్రారంభం లో ‘దసరా’ చిత్రం తో భారీ బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకున్న నాని, అదే ఏడాది చివర్లో ‘హాయ్ నాన్న’ సినిమాతో మరో భారీ బ్లాక్ బస్టర్ ని అందుకున్నాడు. కమర్షియల్ గా ఈ రెండు సినిమాలు గత ఏడాది బయ్యర్స్ కి భారీ లాభాలను తెచ్చిపెట్టిన సినిమాలు గా నిల్చింది. రెండు సినిమాలకు కలిపి 200 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి.
‘దసరా’ చిత్రం తో పోలిస్తే ‘హాయ్ నాన్న’ చిత్రానికి చాలా తక్కువ ఓపెనింగ్స్ వచ్చాయి. 30 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఇది రికవర్ అవ్వడం కష్టమేమో అని అందరూ అనుకున్నారు. కానీ అందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ నాని ఈ సినిమాకి ఏకంగా 50 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను కొల్లగొట్టి ట్రేడ్ పండితులను ఆశ్చర్యపోయేలా చేసాడు.
రీసెంట్ గా ఈ సినిమాని నెట్ ఫ్లిక్స్ లో తెలుగు, హిందీ, తమిళం మరియు మలయాళం భాషల్లో విడుదల చేసారు. థియేటర్స్ లో వచ్చిన రెస్పాన్స్ కంటే ఎక్కువగా ఓటీటీ స్ట్రీమింగ్ లో రెస్పాన్స్ ని దక్కించుకుంది ఈ చిత్రం. గ్లోబల్ వైడ్ గా అన్నీ దేశాల్లో కూడా టాప్ ట్రెండింగ్ లో ఉన్న చిత్రం ఇదే. మధ్యలో కొన్ని కొత్త సినిమాలు వచ్చాయి కానీ, అవి పెద్దగా ట్రెండింగ్ లోకి రాలేదు. జనవరి 8 వ తేదీ నుండి 14 తేదీ వరకు ‘హాయ్ పప్పా'(హిందీ వెర్షన్) కి 1.2 మిలియన్ వ్యూస్ వచ్చాయట.
ఇక తెలుగు వెర్షన్ ‘హాయ్ నాన్న’ కి 1 మిలియన్ కి పైగా వ్యూస్ వచ్చాయట. ఇటీవల కాలం లో ఈ రేంజ్ వ్యూస్ ని సాధించిన చిత్రం ఓటీటీ లో నెట్ ఫ్లిక్స్ లో లేదని. భవిష్యత్తులో ఈ చిత్రం #RRR ని కొట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదంటూ చెప్తున్నారు ట్రేడ్ పండితులు . నాని సినిమాలకు ఫ్యామిలీ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఉన్న సంగతి మన అందరికీ తెలిసిందే. అలాంటిది ఇప్పుడు ‘హాయ్ నాన్న’ వంటి ఫ్యామిలీ ఓరియెంటెడ్ సబ్జెక్టు చేస్తే ఆ మాత్రం ఆదరించకుండా ఎందుకు ఉంటారు అంటూ నాని స్టామినా పై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు ఆయన అభిమానులు.