Kavali YCP Candidate : అయ్యయ్యో నేను కూడా సైకిల్ కే ఓటేశానే.. కావలి వైసీపీ అభ్యర్థి గందరగోళ వ్యాఖ్యలు
Kavali YCP Candidate : ఎన్నికలు వస్తే చాలు పార్టీలు, ప్రచారం, గుర్తులు ఇలా అన్ని రకాలుగా అభ్యర్థులు నెల, రెండు నెలల నుంచి ప్రచారం చేసుకుంటారు. ముఖ్యంగా తమ పార్టీ గుర్తుకే ఓటు వేయాలని చెబుతుంటారు. అయితే ఏపీలో ఒక వింత జరిగినట్లు తెలుస్తోంది. ఓ పార్టీ అభ్యర్థి తన పార్టీ గుర్తుకు ఓటేయకుండా పక్క పార్టీ గుర్తుకు ఓటేసినట్లు ప్రచారం జరగుతోంది. ఇందులో ఎంత వాస్తవం ముందో తెలియదు కానీ,ఇప్పటి వరకు ఇలాంటి సంఘటన ఎక్కడ జరిగినట్లు లేదు. ఎవరైనా సరే తమ పార్టీకే ఓటు వేస్తారు. అనుచరుల ద్వారా ఓటేయాలని ప్రచారం చేయిస్తారు.
కావలి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి తన గుర్తు ఫ్యాన్ కు కాకుండా టీడీపీ గుర్తు సైకిల్ కు ఓటేశారని ప్రచారం జరుగుతోంది. ఇలా అనుకోకుండా ఓటేసినట్లు అనుచరులకు చెప్పడంతో వారు దీన్ని బయట చెప్పొద్దంటూ ఎన్నికల సిబ్బందిని బెదిరించారని తెలుస్తోంది.
వైసీపీ హయాంలో దాదాపు 4 వేల కోట్ల రూపాయల అవినీతి చేయడం వల్లే ప్రతాప్ రెడ్డి ఇలాంటి అనవసర రాద్ధాంతాలు చేస్తున్నాడని కొంతమంది టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. రాబోయేది ఏపీలో టీడీపీ ప్రభుత్వమే కాబట్టి అక్కడ కచ్చితంగా విచారణ ఎదుర్కొని జైలుకు వెళ్లడం ఖాయం కాబట్టి ఇదంతా ఎందుకు గోల అని ముందుగానే టీడీపీకి ఓటేశానని చెబితే పనైపోతుందని అనుకున్నాడని చెబుతున్నారు.
ఒక వేళ టీడీపీ గెలిస్తే తనపై ఎలాంటి విచారణ జరగకుండా చూసుకునేందుకు చేసిన ప్రయత్నమని కొంతమంది అంటున్నారు. టీడీపీ కూటమి ఒక వైపు, వైసీపీ మరో వైపు కావడంతో ఏపీలో హోరాహోరీ పోరు జరిగింది. చాలా మంది ఈ సారి కూటమి అభ్యర్థిదే విజయమని అంటుండగా.. కొంతమంది వైసీపీ సంక్షేమ పథకాలే గెలిపిస్తాయని చెబుతున్నారు. ఇదంతా ఒక ఎత్తైతే తాను కూడా టీడీపీ కే ఓటేశానని కావలి ఎమ్మెల్యే మాట్లాడినట్లు వార్తలు వస్తుండటంతో వివాదం ముదురుతోంది. ఇదంతా కేవలం కావాలనే ఆడుతున్న నాటకమని ప్రజలు అర్థం చేసుకుంటున్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.