Dimple Hayati : ఒక్క ఫ్లాప్ తోనే హీరోయిన్లు ఫెయిడ్ ఆర్టిస్టులుగా మారుతున్నారు.. డింపుల్ హయతి కామెంట్స్
Dimple Hayati : ఇండస్ట్రీలో లింగవివక్షతపై డింపుల్ హయతి చేసిన వ్యాఖ్యలు కొంత దూమారం రేపాయని చెప్పవచ్చు. ఈ విషయాన్ని ఆమె ఇప్పుడు చెప్పింది కానీ.. ఈ విషయంపై ఇండస్ట్రీలో చాలా ఏళ్లుగానే ఉంది. సాధారణంగా హీరో, హీరోయిన్ల మధ్య పోటీ ఉంటుంది. కానీ ఎప్పుడూ హీరోయిన్లే ఓడిపోతుంటారు. కారణం ఏంటి? ఇక ఇండస్ట్రీలో ఒక హీరో సంవత్సరాల పాటు ఫస్ట్, సెకండ్, థర్డ్ జనరేషన్ హీరోయిన్లతో కూడా హీరో ప్లేస్ లోనే ఉండి నటిస్తాడు. కానీ హీరోయిన్లకు మాత్రం ఆ అవకాశం ఉండదు. ఒక హీరోయిన్ కు సంబంధించి ఒక్క సినిమా ఫెయిల్ అయితే చాలు ఇక ఆమె ఫేడ్ ఆర్టిస్ట్ అయిపోతుంది. తర్వాతి సినిమాలకు పనికికాదు. ఇక రెండు, మూడు సినిమాలు ఫెయిల్ అయితే ఇక ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోవాల్సిందే. అదే హీరోలైతే వరుసగా నాలుగు, ఐదు సినిమాలు డిజాస్టర్ అయినా కొనసాగుతూనే ఉంటాడు. ఇది కొంత ఇబ్బంది కలిగించే అంశం అని డింపుల్ హయతి చెప్పుకచ్చింది. ఇండస్ట్రీలో అప్ కమింగ్ హీరోయిన్స్ రావాలంటే ఉన్న వారు వెళ్లిపోవాల్సిందే కాదా.. అందుకే హీరోయిన్లను తొందరగా పంపించేస్తున్నారని టాక్ కూడా ఉంది. ఏది ఏమైనా దీని గరించి దర్శక, నిర్మాతలు ఆలోచించాల్సిన అవసరం ఉందని డింపుల్ హయతి అంటుంది.