Devika Rani : బ్లాక్ అండ్ వైట్ కాలంలో ముద్దు సీన్లలో నటించిన హీరోయిన్.. ఆమె మన తెలుగు వారంటే నమ్మరు కదా?
Devika Rani : భారతీయ సమాజంలో బహిరంగ ముద్దు కూడా నిషేధమే. ఇక్కడి సంస్కృతి అలా ఉంటుందని ప్రపంచంలో ఏ దేశానికి వెళ్లినా చెప్తుంటారు. అలాంటిది సినిమాల్లో ఆ సీన్స్ చేయాల్సి వస్తే బ్లాక్ అండ్ వైట్ రోజుల్లో తడబడకుండా నో.. చెప్పారు. హీరో ఎంత మ్యన్లీగా ఉన్నా బయటకు మాత్రం ‘నో’నే.. సాయి పల్లవి అయితే ఈ సీన్లకు పూర్తి రిస్ట్రెక్టడ్ అని చెప్పాలి.
అలాంటిది ఈ మధ్య ఈ సీన్లకు ఏ హీరోయిన్ తడబడడం లేదు. హీరో, హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ బాగుంటేనే కత పండుతుంది. వాళ్ల మధ్య బాండింగ్ స్ట్రాంగ్ అని చెప్పేందుకు డైరెక్టర్లు సీన్ పెట్టడం కామన్ గా మారింది.
ఇప్పటి విషయం పక్కన పెడితే.. ఆ రోజుల్లో అంటే బ్లాక్ అండ్ వైట్ రోజుల్లో కూడా ముద్దు సీన్లు అడపా దడపా ఉండేవి. ఆ రోజుల్లో హీరోయిన్లు నలుగురిలోకి వెళ్లి సినిమాలో నటించడం అంటే చాలా ధైర్యం చేసిందనే చెప్పాలి. అలాంటి నటి ‘దేవికా రాణి చౌదరి’. దేవికా రాణి ఇండియా సినిమా తొలి నటి.
1933లో విడుదలైన ‘కర్మ’ సినిమాలో హీరోయిన్ గా నటించిన దేవికా రాణి తొలి ముద్దు సన్నివేశంలో నటించింది. ఆ సీన్ అప్పట్లో కాదు ఇప్పటికీ రికార్దే. ఫస్ట్ కిస్ సీన్ ఈ మూవీ కోసం షూట్ చేశారు. ఇందులో దేవికా రాణి, హీరో హిమాన్షు రాయ్ ముద్దు సన్నివేశంలో నటించారు.
ఈ సీన్‌లో నటి ఒకటి, రెండు కాదు ఏకంగా 4 నిమిషాల పాటు ముద్దుల సన్నివేశాల్లో నటించింది. తెరపై దేవికా రాణి-హిమాన్షు రాయ్ ముద్దుల సీన్ చూసి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇంగ్లిష్ భాషలో తెరకెక్కిన తొలి భారతీయ సినిమా కూడా ఇదే.
దేవికా రాణి స్వస్థలం విశాఖపట్నం. ఆమె విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ కుటుంబానికి చెందింది. ఠాగూర్ సోదరి దేవికా రాణి అమ్మమ్మ. అంతటి చరిత్ర కలిగిన బ్యాగ్రౌండ్ నుంచి వచ్చిన దేవికా ముద్దు సీన్ లో నటించి మరో చరిత్ర క్రియేట్ చేసింది.
దేవికా తండ్రి కల్నల్ ఎస్ఎం చౌదరి మద్రాస్ ప్రావిన్స్ ఫస్ట్ జనరల్ సర్జన్. ఆమె తన తొమ్మిదేళ్ల వయసులో చదువు కునేందుకు ఇంగ్లండ్ వెళ్లింది. ముగించుకొని వచ్చిన తర్వాత నటి కావాలనుకుంది.
దేవికా లండన్‌లో ఉన్న సమయంలోనే హిమాన్షు రాయ్‌తో పరిచయం ఉండేది. ఆ తర్వాత ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. హిమాన్షు లండన్‌లో సినిమా టెక్నాలజీ అభ్యసించాడు.
హిమాన్షు చదువు ముగించుకొని ఇండియాకు వచ్చి ‘బాంబే టాకీస్’ అనే సినిమా కంపెనీని స్థాపించారు. ఈ సంస్థ నిర్మించిన చిత్రంలోనే దేవికా రాణి నటించింది. ఆ సినిమాలోనే ముద్దు సీన్‌లో నటించి సెన్సేషన్ క్రియేట్ చేసింది.
ఇండియన్ సినిమా తొలి బోల్డ్ నటి అయిన దేవికా రాణి పదేళ్ల పాటు చిత్ర పరిశ్రమలో పనిచేశారు. 1969లో ‘దాదాసాహెబ్ ఫాల్కే’ అవార్డును సైతం అందుకున్నారు. ఈ అవార్డును గెలుచుకున్న తొలి భారతీయ మహిళగా గుర్తింపు సంపాదించుకున్నారు. దీనికి ముందే 1958లో ‘పద్మశ్రీ’ వరించింది.