Anjali : శ్రీలీల లాగ నేను డబ్బులకు కక్కుర్తి పడే మనిషిని కాదు అంటూ హీరోయిన్ అంజలి షాకింగ్ కామెంట్స్!
Anjali : మన తెలుగు అమ్మాయిలు సినీ ఇండస్ట్రీ లో హీరోయిన్స్ గా సక్సెస్ కాలేరు, ఎందుకంటే ఇక్కడ హీరోయిన్ అవ్వాలంటే డైరెక్టర్స్ ఏది చెప్తే అది చెయ్యాలి. దేనికి వ్యతిరేకించకూడదు, అందాలను ఆరోబోయ్యాలి, రొమాంటిక్ సన్నివేశాల్లో హద్దులు చెరిపెయ్యాలి, ఇలాంటివన్నీ మన తెలుగు అమ్మాయిలు చెయ్యరు కాబట్టి, వాళ్ళు సక్సెస్ కాలేరు అనేది కొంతమంది అభిప్రాయం.
అయితే కొంతమంది తెలుగు అమ్మాయిలు మాత్రం అలాంటి అపోహలను చెరిపి వేసి సౌత్ లోనే పెద్ద స్టార్ హీరోయిన్స్ గా ఎదిగి చూపించారు. అలాంటి వారిలో ఒకరు అంజలి. ఈమెకి బోలెడంత అందం తో పాటు, ప్రేక్షకులను మైమరపించే యాక్టింగ్ టాలెంట్ కూడా ఉంది. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాతో ఈమె ప్రతీ తెలుగింట్లో ఒక అమ్మాయి గా అందరికీ దగ్గరైంది. ఆ సినిమా తర్వాత ఈమెకి ఎన్నో ఆఫర్స్ వచ్చాయి కానీ, ఆమె మాత్రం నటన ప్రాధాన్యత ఇచ్చిన పాత్రలను మాత్రమే చేస్తూ వచ్చింది.
ఆమె ఫిల్మోగ్రఫీ ని ఒక్కసారి చూస్తే ఈ విషయం అందరికీ అర్థం అవుతుంది. కేవలం తెలుగు లో మాత్రమే కాదు, ఈమె తమిళం, మలయాళం మరియు కన్నడ భాషల్లో కూడా సినిమాలు చేసింది. ఎక్కువగా ఈమె లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. అలా ఆమె అప్పట్లో చేసిన ‘గీతాంజలి’ అనే కామెడీ హారర్ థ్రిల్లర్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ గా గీతాంజలి 2 తెరకెక్కింది. అతి త్వరలోనే విడుదల కాబోతున్న ఈ సినిమా ప్రొమోషన్స్ కార్యక్రమాల్లో చాలా చురుగ్గా పాల్గొంటుంది అంజలి. అందులో భాగంగా రీసెంట్ గా మూవీ టీం ఏర్పాటు చేసిన ఒక ప్రెస్ మీట్ లో అంజలి పాల్గొన్నది. అక్కడ ఒక మీడియా రిపోర్టర్ అంజలి కి చిరాకు కలిగించే ప్రశ్నలు అడిగింది.
ఆమె మాట్లాడుతూ ‘అంజలి గారు..నేను మీకు పెద్ద అభిమానిని, కానీ మీరు నేను ఊహించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోయారు, తెలుగు అమ్మాయి అవ్వడం వల్లే అలా జరిగింది అంటారా?’ అని అడగగా, దానికి అంజలి సమాధానం చెప్తూ ‘నేను సక్సెస్ కాకపోతే మీరు నా అభిమాని ఎలా అయ్యారు’ అని అంటుంది. అప్పుడు రిపోర్టర్ ‘అంటే ఇప్పుడు టాలీవుడ్ మొత్తం శ్రీలీల మేనియా కనిపిస్తుంది, అలా మీది కనిపించలేదని నా అభిప్రాయం’ అని అంటుంది. అప్పుడు అంజలి దానికి సమాధానం చెప్తూ ‘నేను కేవలం తెలుగు కాదు, నాలుగు భాషల్లో నటిస్తున్నాను, నా మనసుకి నచ్చిన పాత్రలను మాత్రమే చేస్తాను, ఇతర హీరోయిన్స్ లాగ డబ్బులు కోసం ఏ పాత్ర అయినా చేసిన రకం కాదు నేను, అలా చేసి ఉంటే నేను కూడా అదే రేంజ్ లో ఉండేదానిని’ అంటూ చెప్పుకొచ్చింది.