JAISW News Telugu

Alia Bhatt : సినిమాల ద్వారా హీరోయిన్ అలియా భట్ సంపాదించిన ఆస్తులు ఎంతో తెలిస్తే నోరెళ్లబెడుతారు!

Heroine Alia Bhatt's assets earned through movies

Heroine Alia Bhatt’s assets earned through movies

Alia Bhatt : ఇండియా లోనే హైయెస్ట్ పైడ్ హీరోయిన్స్ లిస్ట్ తీస్తే అలియా భట్ బహుశా నెంబర్ 1 స్థానం లో ఉంటుందేమో. ప్రముఖ దర్శక నిర్మాత మహేష్ భట్ కూతురుగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన అలియా భట్ మొదట్లో చాలా లావుగా ఉండేది. ఆ తర్వాత సరైన వర్కౌట్స్ చేసి సన్నగా మారింది. సినిమాల్లోకి వచ్చిన తర్వాత తన తండ్రి వారసత్వం తో ఈమె అవకాశాలను సంపాదించలేదు.

తన అద్భుతమైన యాక్టింగ్ టాలెంట్ తోనే అవకాశాలను పొందుతూ వచ్చింది. కెరీర్ లో ఎన్నో విలక్షణమైన పాత్రలు చేస్తూ వచ్చిన ఈమె, మన తెలుగులో #RRR చిత్రం చేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం తో ఆమె మన తెలుగు ఆడియన్స్ కి కూడా బాగా దగ్గరైంది. అలియా భట్ అంటే ఇప్పుడు తెలియని తెలుగు వాళ్లంటూ ఎవ్వరూ లేరు అనడం లో ఎలాంటి సందేహం లేదు. రీసెంట్ గానే ఆమె ప్రముఖ బాలీవుడ్ క్రేజీ హీరో రణబీర్ కపూర్ ని ప్రేమించి పెళ్ళాడి ఒక ఆడబిడ్డకు జన్మని కూడా ఇచ్చింది.

ఇదంతా పక్కన పెడితే అలియా భట్ ఆస్తుల వివరాలు ఇప్పుడు సోషల్ మీడియా లో లీక్ అయ్యి తెగ వైరల్ గా మారింది. ప్రస్తుతం ఈమె ఒక్కో సినిమాకి దాదాపుగా 10 కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ ని అందుకుంటుంది. ఇండియా లోనే టాప్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోయిన్ ఈమెనే అనుకుంట, ఆమెకి ఉన్న డిమాండ్ కి, క్రేజ్ కి అంత అడగడం లో తప్పు లేదని అనేవాళ్ళు కూడా ఉన్నారు. ఇదంతా పక్కన పెడితే రీసెంట్ గానే ఈమె లండన్ లోని కోవెంట్ గార్డెన్ లో 25 కోట్ల రూపాయిలు విలువ చేసే విలాసవంతమైన బంగ్లాని కొనుగోలు చేసింది.

లండన్ లో అత్యంత ధనవంతులు నివసించే ప్రాంతం లో కోవెంట్ గార్డెన్ కూడా ఒకటి. 2020 లో బాంద్రా లోని వాస్తుపల్లి హిల్స్ కంప్లెక్స్ లోని 5 వ అంతస్తులో 40 కోట్ల రూపాయిలు విలువ చేసే ఇల్లు ని కొనుగోలు చేసింది. ఇలా చెప్పుకుంటూ పోతే లిస్ట్ చాంతాడు అంత ఉంటుంది. ఆమె గడిచిన ఈ పదేళ్లలో దాదాపుగా 600 కోట్ల రూపాయిల ఆస్తులను కూడగట్టింది అని తెలుస్తుంది. ఇదంతా ఆమె తన సినిమాల ద్వారా సంపాదించిన డబ్బు తోనే చేసిందట. ఆమె సంపాదన చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.

Exit mobile version