Heroine Aditi Rao : ఇప్పుడు కాస్టింగ్ కౌచ్ అనేది సినిమా ఇండస్ట్రీని ఎలా పీక్కుని ఏడిపిస్తుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దాని బారిన పడి కొందరు జీవితాలను నాశనం చేసుకుంటే.. ఇంకొందరు మాత్రం అవకాశాల కోసం పక్కదార్లు కూడా తొక్కి స్టార్లుగా మారుతున్నారు. అయితే కాస్టింగ్ కౌచ్ బారిన పడి చాలామంది ఎదురు దెబ్బలు తింటున్నారు. కొందరు నోరు విప్పి చేదు అనుభవాలను పంచుకుంటున్నారు.
ఇంకొందరు మాత్రం కాస్టింగ్ కౌచ్ ను లైట్ తీసుకుంటున్న వారు కూడా ఉంటున్నారు. ఇప్పుడు అదితిరావు హైదరీ కూడా ఇలాంటి కామెంట్లే చేసింది. ఆమె మాట్లాడుతూ.. కాస్టింగ్ కౌచ్ అనేది ఎప్పటి నుంచో ఉందని నాకు తెలుసు. కాకపోతే నేను ఎప్పుడూ దాన్ని డైరెక్ట్ గా ఫేస్ చేయలేదు. కేవలం ముందు చూపుతో ముందుకు వెళ్తున్నాను.
గతంలో కూడా ఎంతో మంది దానిపై కామెంట్లు చేశారు. కానీ నాకు ఎందుకో అదిపెద్ద సమస్యగా అనిపించట్లేదు. దానికంటే పెద్ద సమస్యలు చాలానే ఉన్నాయి. ఇండస్ట్రీలో అవకాశాల కోసం ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలని ఎవరికి వారి వ్యక్తిగత నిర్ణయం. దాన్ని తప్పు పట్టాల్సివన అవసరం లేదన్నది నా భావన. ఎందుకంటే అవకాశాలు అందుకోవడం కోసం ఏమైనా చేస్తుంటారు.
ఎంతో కష్టపడి ముందుకు వెళ్లాలని అనుకుంటారు. కాబట్టి కాస్టింగ్ కౌచ్ కు పాల్పడే వారి గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు అని ప్రకటించింది అదితి రావు హైదరీ. ఆమె చేసిన కామెంట్లు ఇప్పుడు తీవ్రమైన చర్చలకు దారి తీస్తున్నాయి. ఆమె ఇప్పుడు సిద్దార్థ్ తో డేటింగ్ లో ఉందని అంటున్నారు. కానీ దానిపై ఆమె ఇంకా క్లారిటీ ఇవ్వలేకపోతోంది.