Hero Venu Father Passed Away : ప్రముఖ హీరో వేణు తొట్టెంపూడి తండ్రి వెంకట సుబ్బారావు నేడు ఉదయం అస్వస్థతో కన్నుమూసాడు. 92 ఏళ్ళ వయస్సు ఉన్న సుబ్బారావు గత కొంతకాలం నుండి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. కుటుంబ సభ్యులు చికిత్స అందించి ఆయన ప్రాణాలను కప్పుకోవడానికి ప్రయత్నం చేసినప్పటికీ అది విఫలం అయ్యింది. వెంకట సుబ్బారావు కి అటు సినిమాల పరంగా , ఇటు రాజకీయ పరంగా మంచి సంబంధాలే ఉన్నాయి.
వివిధ వ్యాపారాలతో ఆయన హైదరాబాద్ లోనే అత్యంత ధనికుల జాబితాలో ఒకడిగా నిలిచాడు. అలాంటి వ్యక్తి నేడు చనిపోవడం పట్ల టాలీవుడ్ కి చెందిన సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు దిగ్భ్రాంతిని వ్యక్తం చేసారు. ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు వేణు ఇంటికి వెళ్లి సుబ్బారావు పార్థివ దేహానికి నివాళులు అర్పించి సానుభూతి వ్యక్త పరిచారు. సోషల్ మీడియా లో కూడా నెటిజెన్స్ సుబ్బారావు కి నివాళులు అర్పిస్తూ వేణు కి ధైర్యం చెప్తున్నారు.
ఇక వేణు తొట్టెంపూడి విషయానికి వస్తే ‘స్వయంవరం’ సినిమాతో ఇండస్ట్రీ లోకి హీరోగా అడుగుపెట్టిన ఆయన, తొలి సినిమాతోనే భారీ బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకోవడం తో అవకాశాలు క్యూ కట్టాయి. అలా తన వద్దకి వచ్చిన ప్రతీ స్క్రిప్ట్ ని గుడ్డిగా నమ్మి ఓకే చెయ్యకుండా కేవలం తనని మరో మెట్టుకు తీసుకెళ్లే సినిమాలనే చేస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని సంపాదించుకున్నాడు. ఈయన చేసిన సినిమాలలో ‘స్వయంవరం’ తో పాటుగా ‘చిరునవ్వుతో’, ‘హనుమాన్ జంక్షన్’, ‘కల్యాణ రాముడు’, ‘పెళ్ళాం ఊరెళితే’, ‘ఖుషి ఖుషీగా’, ‘చెప్పవే చిరుగాలి’,’శ్రీకృష్ణ 2006′, ‘యమగోల మళ్ళీ మొదలైంది’, ‘గోపి గోపిక గోదావరి’ వంటి సినిమాలు భారీ హిట్స్ అయ్యాయి. ఈ చిత్రాలను ఇప్పుడు టీవీ లో టెలికాస్ట్ చేసినా కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది.
ఆ రేంజ్ రిపీట్ వేల్యూ ఉన్న సినిమాలు ఇవి. అయితే ఇంత మంచి కెరీర్ ఉన్నప్పటికీ కూడా, ఎందుకో వేణు తొట్టెంపూడి దానిని కొనసాగించేందుకు ఆసక్తి చూపలేదు. సినిమాలకు సుదీర్ఘ విరామం ఇచ్చి, వ్యాపారాల్లో బిజీ అయ్యాడు. మళ్ళీ ఆయన చాలా కాలం తర్వాత రవితేజ హీరో గా నటించిన ‘రామారావు ఆన్ డ్యూటీ’ చిత్రం లో ముఖ్యమైన పాత్ర పోషించాడు. ఆ తర్వాత ఓటీటీ లో ‘అతిథి’ అనే వెబ్ సిరీస్ కూడా చేసాడు. ఈ రెండు కూడా ఆయనకి పెద్దగా క్రేజ్ తీసుకొని రాలేకపోయాయి.