Aashritha Campaign : కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో హీరో వెంకటేశ్ కుమార్తె ఆశ్రిత

Aashritha Election Campaign
Aashritha Campaign : హీరో వెంకటేశ్ పెద్ద కుమార్తె ఆశ్రిత కాంగ్రెస్ తరపున ఎన్నికల ప్రచారంలోకి దిగారు. ఖమ్మం లోక్ సభ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రామసహాయం రఘురామరెడ్డి, హీరో వెంకటేశ్ కు వియ్యంకుడు. వెంకటేశ్ పెద్ద కుమార్తె ఆశ్రిత, రఘురామరెడ్డి పెద్ద కోడలు. ఆయన కుమారుడు వినాయక్ రెడ్డిని ఆశ్రిత పెళ్లి చేసుకున్నారు. ఆశ్రిత తన మామ, ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రఘురామరెడ్డి తరపున ప్రచారం చేశారు. ఖమ్మంలో నిర్వహించిన కాంగ్రెస్ ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు.
ఈ సమావేశంలో ఆమె మాట్లాడుతూ రఘురామరెడ్డి గెలిస్తే నియోజక వర్గ అభివృద్ధికి ఏం చేస్తారనేది వివరించారు. గత ఐదేళ్లలో నామా ఏంచేశారో చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. అటు మే 7న వెంకటేశ్ సైతం వియ్యంకుడి తరపున ప్రచారం చేయనున్నట్లు సమాచారం. ఈ నెల 5వ తేదీన వెంకటేశ్ ఖమ్మంలో పర్యటించే అవకాశం ఉంది.