Shekhar Suman : నటుడు శేఖర్ సుమన్, కాంగ్రెస్ మాజీ నేత రాధిక ఖేడా ఇద్దరూ బీజేపీలో చేరారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీని వీడిన శేఖర్ సుమన్ కాంగ్రెస్ మీడియా మాజీ సమన్వయ కర్త రాధికా ఖేడా మంగళవారం ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో బీజేపీలో చేరారు. వీరిద్దరు కాంగ్రెస్ నేతలు తమను వేధిస్తున్నారని ఆరోపిస్తూ గత వారం పార్టీకి రాజీనామా చేశారు. శేఖర్ మాట్లాడుతూ ‘‘సానుకూల ఆలోచనలతోనే నేను బీజేపీలో చేరాను. నన్ను ఈ పార్టీలోకి వచ్చేలా చేసిన భగవంతుడికి కృతజ్ఞతలు’’ అని తెలిపారు.
రాధిక ఖేడా మాట్లాడుతూ ‘‘నేను రామ్ లల్లా దర్శనం చేసుకున్నందుకు కాంగ్రెస్ లోని కొందరు నేతలను నాతో అనుచితంగా ప్రవర్తించారు. కాంగ్రెస్ రాముడిని, హిందూ మతాన్ని వ్యతిరేకించే పార్టీ. బీజేపీ నాకు మద్దతుగా నిలిచింది. కాబట్టే నేను ఈ పార్టీలోకి వచ్చాను. అందుకు ప్రధాని మోదీకి కృతజ్ఞతలు’’ అని పేర్కొన్నారు.