Ram Pothineni : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్య మంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 2024లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చెందడం ఖాయమని ఒక తెలుగు సినిమా హీరో నాలుగేళ్ల కిందటనే చెప్పేశాడు. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది. ఆ హీరో నాలుగేళ్ల కిందట చెప్పిన మాటలు ఇప్పుడు నిజం అయ్యాయి. ఆ వీడియో దృశ్యాలను ఏపీ ప్రజలు, వివిధ పార్టీల నాయకులు చూస్తున్నారు. చూస్తూ ఇతరులకు పోస్ట్ చేస్తున్నారు. వైసీపీ అంటే గిట్టని వారు కూడా ఆ వీడియో ను సోషల్ మీడియా లో వైరల్ చేస్తూ ఆనందిస్తున్నారు. ఇంతకు ఆ హీరో ఎవరంటే రామ్ పోతినేని. ఈ నేపథ్యంలో ఆయన తెరమీదకు రావడం రాజకీయ వర్గాల్లో అయన మాటలు చర్చనీయాంశం అవుతున్నాయి. వైసీపీ ఓటమిని ఆ హీరో జగన్ పాలన చేత పట్టిన ఏడాదికే చెప్పి హెచ్చరించడం విశేషం.
ముఖ్యమంత్రి గారు మీరు కొందరిని నమ్ముకున్నారు. వారు మీ నమ్మకానికి తగ్గట్టుగా పనిచేయడంలేదు. మీకు తెలియకుండా చేసే పనుల వలన మీ ప్రతిష్టకు భంగం కలిగే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. వాళ్ళ మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతయినా ఉంది అంటూ హీరో రామ్ ఆగష్టు 15, 2020 రోజున సోషల్ మీడియా లో ఓ ట్విస్ట్ వేశాడు. అది ఇప్పుడు వైరల్ కావడంతో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో పెద్ద వైరల్ అయ్యింది.
2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలింది వైసీపీ తోనే. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ తో నెట్టుకొచ్చిన చంద్రబాబు నాయుడికి వైసీపీ తో కోలుకోలేని దెబ్బ తగిలింది. ఇప్పుడు అదే పరిస్థితి వైసీపీ ఎదుర్కొంది. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో 175 స్థానాల్లో పోటీ చేసిన వైసీపీ అభ్యర్థులు అధినేత తో కలిసి 11 మంది విజయం సాధించారు.
హీరో రామ్ వ్యక్తం చేసిన అభిప్రాయాన్ని ఇప్పుడు ఓటమి చెందిన నాయకులు సైతం ఒప్పుకుంటున్నారు. పార్టీ పదవుల్లో ఉన్నవారు, సీనియర్ నాయకులు కూడా సినీ నటుడు చెప్పిన మాటలు అవుననే అంటున్నారు. తెలుగు దేశం పార్టీ అధికారంలోకి రాబోతున్న తరుణంలో వైసీపీ నాయకులపై దాడులు జరుగుతున్నాయని మొత్తుకుంటున్నారు. గవర్నర్ కు ఫిర్యాదు చేయాలని కొందరు నాయకులు అంటున్నారు. జగన్ అయితే ఏకంగా అవసరమైతే జరిగే దాడులపై కోర్ట్ కు వెళుదామంటున్నారు.