Nikhil Wife Seemantam : ఘనంగా జరిగిన హీరో నిఖిల్ భార్య సీమంతం..వైరల్ అవుతున్న ఫోటోలు!

Nikhil Wife Seemantam

Nikhil Wife Seemantam

Nikhil Wife Seemantam Photos : ప్రస్తుతం ఉన్న యంగ్ హీరోలలో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ ఇమేజి లేకుండా ఇండస్ట్రీ కి వచ్చి సక్సెస్ అయిన వారిలో ఒకడు నిఖిల్ సిద్దార్థ. ‘హ్యాపీ డేస్’ సినిమాతో వెండితెర అరంగేట్రం చేసిన నిఖిల్, తొలిసినిమాతోనే ఎవరీ అబ్బాయి ఇంత హుషారు గా ఉన్నాడు అని అనిపించుకున్నాడు. ఆ తర్వాత పలుసినిమాల్లో హీరో గా చేసాడు కానీ పెద్దగా సక్సెస్ అవ్వలేదు. ఎప్పుడైతే ఆయన ‘స్వామిరారా’ అనే చిత్రం చేసాడో , అప్పటి నుండి ఆయన కెరీర్ పూర్తిగా మారిపోయింది అనే చెప్పాలి.

విభిన్నమైన కథాంశాలతో హిట్టు మీద హిట్టు కొడుతూ అతి తక్కువ సమయం లోనే తనకంటూ ఒక మార్కెట్ ని ఏర్పాటు చేసుకున్నాడు. నిఖిల్ సినిమా విడుదల అవుతుంది అంటే కచ్చితంగా ఆడియన్స్ లో ఎదో కొత్తగా ట్రై చేసి ఉంటాడు, ఒకసారి కచ్చితంగా థియేటర్ లో చూడాల్సిందే అనే ఉద్దేశం కి వచ్చేస్తున్నారు. ఇలాంటి బ్రాండ్ ఇమేజి ని సంపాదించుకోవడం అనేది చిన్న విషయం కాదు.

Nikhil Wife Pallavi Seemantam

Nikhil Wife Pallavi Seemantam

ఇక ‘కార్తికేయ 2’ చిత్రం తో పాన్ ఇండియా లెవెల్ లో భారీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి తన సత్తా చాటిన నిఖిల్, ఇక నుండి అన్నీ అలాంటి సినిమాలు చెయ్యడానికే ఆసక్తి చూపిస్తున్నాడు. ఆయన గత చిత్రం ‘స్పై’ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోకపోయినా, కమర్షియల్ గా మాత్రం యావరేజిగా నిల్చింది. ప్రస్తుతం ఆయన ‘ఇండియా హౌస్’, ‘స్వయంభు’ వంటి పాన్ ఇండియన్ సినిమాలను చేస్తున్నాడు. ఇదంతా పక్కన పెడితే నిఖిల్ తన బ్యాచిలర్ జీవితానికి టాటా చెప్తూ 2020 వ సంవత్సరం లో పల్లవి వర్మ అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వృత్తి రీత్యా పల్లవి ఒక డాక్టర్.

పెళ్ళై మూడేళ్లు అయ్యింది కదా, ఇంకా ఎలాంటి విశేషం వినలేదు ఏమిటి అని అందరూ అనుకుంటున్న సమయం లో రీసెంట్ గా ఆయన తన భార్య కి సీమంతం జరిగింది అని పెట్టిన పోస్టు వైరల్ అయ్యింది. ఈ సందర్భంగా నిఖిల్ మాట్లాడుతూ ‘ నా భార్యకు సంప్రదాయ పద్దతిలో సీమంతం వేడుకను జరిపించాం. పల్లవి, నేను త్వరలోనే మా మొదటి బిడ్డకి స్వాగతం పలకబోతున్నాం. ఈ విషయాన్నీ మీ అందరితో పంచుకోవడం నాకు ఎంతో సంతోషం గా ఉంది’ అంటూ ఆయన వేసిన ఒక పోస్టు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

TAGS