Hero Kiran Abbavaram : ఎట్టకేలకు దొరికిన హీరో కిరణ్ అబ్బవరం ఆచూకీ.. సంబరాల్లో ఫ్యాన్స్!

Hero Kiran Abbavaram
Hero Kiran Abbavaram : ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన అతి తక్కువ సమయం లోనే మంచి గుర్తింపు దక్కించుకున్న హీరోలలో ఒకడు కిరణ్ అబ్బవరం. ‘రాజా వారు రాణి వారు’ అనే సినిమాతో ఇండస్ట్రీ కి హీరోగా పరిచయం అయ్యాడు ఆయన. ఈ సినిమాకి కథ, స్క్రీన్ ప్లే రైటర్ గా కూడా పనిచేసాడు. పర్వాలేదు అనే రేంజ్ లో ఆడిన ఈ సినిమా తర్వాత ఆయన ‘SR కల్యాణ మండపం’ అనే చిత్రం లో నటించాడు.
ఈ సినిమా కమర్షియల్ గా ఏ రేంజ్ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే. ఈ చిత్రం తర్వాత ఆయనకీ వరుసగా సినిమా ఆఫర్లు వచ్చాయి కానీ, కొన్ని హిట్ అయ్యాయి, కొన్ని ఫట్ అయ్యాయి. హిట్ అయినా వాటికంటే ఫట్ అయినవే ఎక్కువ.
ఆయన గత చిత్రం ‘రూల్స్ రంజన్’ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చింది. దీంతో కాస్త గ్యాప్ తీసుకున్న ఆయన ‘దిల్ రూబా’ అనే సినిమాతో మన ముందుకు రాబోతున్నాడు. ఇందులో హీరోయిన్ గా రుక్సార్ ధిల్లాన్ నటిస్తుండగా, కొత్త దర్శకుడు ఈ సినిమా ద్వారా ఇండస్ట్రీ కి పరిచయం అవ్వబోతున్నారు.
సమ్మర్ కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేసే ఆలోచనలో ఉన్నట్టుగా కిరణ్ అబ్బవరం ఈ సందర్భంగా మేకర్స్ కి తెలిపాడు. వరుస ఫ్లాప్స్ తో ఎటు పోయాడో అని అనుకుంటున్న కిరణ్ అబ్బవరం ఈ ప్రాజెక్ట్ ని ప్రకటించి ఆయన ఫ్యాన్స్ లో సంతోషం ని నింపాడు.