Mahanati Savitri : మహానటికి భర్తగా, కొడుకుగా నటించిన హీరో కమ్ విలన్ ఎవరో తెలుసా?
Mahanati Savitri : ఒకప్పటి టాలీవుడ్ అనూహ్య మైన కాంబినేషన్లకు పెట్టింది పేరు. పొద్దున ఒక సినిమాలో చేస్తున్న నటీనటులు సాయంత్రం మరో సినిమాలో వేర్వేరు క్యారెక్టర్లు చేసేవారు. ఒకే రోజులో పదుల సంఖ్యలో పెద్ద హీరోల సినిమాలు షూటింగ్ లు జరుపుకునేవి. తెలుగు సినిమాల్లో దాదాపు తెలుగు నటులు ఉండేవారు.
ఇక టాలీవుడ్ లో ఒకే హీరోకి చెల్లిగా, ప్రేయసిగా నటించిన హీరోయిన్లు కూడా ఉన్నారు. శ్రీదేవి తన బాల్యంలో దివంగత ఎన్టీఆర్ కి మనవరాలిగా నటించింది. ఆ తర్వాత హీరోయిన్ అయ్యాక అదే ఎన్టీఆర్ తో అనేక బ్లాక్ బస్టర్ చిత్రాల్లో ఆడిపాడింది. అంజలి, ఎన్టీఆర్ కాంబినేషన్ తెలుగునాట సూపర్ హిట్ పెయిర్ గా నిలిచింది. వీరి కాంబినేషన్ లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు వచ్చాయి. అంజలి హీరోయిన్ గా ఫేడ్ అవుట్ అయ్యాక ఎన్టీఆర్ కు తల్లిగా చేసి నటించి మెప్పించింది.
ఇక తెలుగులో మహానటి సావిత్రి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎన్టీఆర్, ఏఎన్నార్ అగ్రహీరోలుగా చెలామణి అవుతున్న సమయంలో వారితో సమానం రెమ్యూనరేషన్ అందుకున్న ఏకైక హీరోయిన సావిత్రి. అప్పుడప్పుడే సినిమాల్లో రాణిస్తున్న ఓ చిన్న నటుడు మహానటి సావిత్రికి ఒకే రోజు రెండు సినిమాల్లో వేర్వేరు పాత్రలు పోషించాడు. ఒక చిత్రంలో సావిత్రికి భర్తగా నటించగా, మరో చిత్రంలో అదే సావిత్రికి కొడుకుగా నటించడం విశేషం. సినిమాలు వేరయినా రెండు విరుద్ధమైన పాత్రలే. ఇలా ఒకే రోజు రెండు పాత్రలు పోషించి గుర్తింపు తెచ్చుకున్నాడు గిరిగిబాబు. 1973లో జగమే మాయ చిత్రంతో గిరిబాబు సినీ పరిశ్రమకు పరిచయం అయ్యాడు .అదే ఏడాది గిరిబాబు జ్యోతి-లక్ష్మి, అనగనగా ఓ తండ్రి చిత్రాల్లో నటించాడు. ఈ రెండు చిత్రాల్లో అప్పటి మహానటి సావిత్రి కూడా నటించారు.
జ్యోతి-లక్ష్మి చిత్రంలో గిరిబాబు సావిత్రి భర్తగా నటించాడు. మరోవైపు అనగనగా ఓ తండ్రి చిత్రంలో సావిత్రికి కొడుకుగా చేయడం విశేషం. అయితే ఈ రెండు సినిమాలు ఒకే రోజు షూటింగ్ జరుపుకోవడం మరో విశేషం. ఉదయం షిఫ్ట్ లో జ్యోతి-లక్ష్మి చిత్రంలో భార్యాభర్తలుగా నటించారు సావిత్రి-గిరిబాబు. ఇక సాయంత్రం షిఫ్ట్ లో అనగనగా ఓ తండ్రి సినిమా షూటింగ్ లో తల్లీ కొడుకులుగా సావిత్రి-గిరిబాబు నటించారు.
కెరీర్ తొలినాళ్లలోనే మహానటి సావిత్రితో స్క్రీన్ షేర్ చేసుకునే అదృష్టం పొందాడు గిరిబాబు . అనంతరం గిరిబాబు టాలీవుడ్ లో విలన్ గా మంచి పేరు తెచ్చుకున్నాడు. వందలాది చిత్రాల్లో కరుడుగట్టిన విలన్ పాత్రలు పోషించాడు. 90లలో గిరిబాబు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానూ మంచి పాత్రలు వేశాడు. తండ్రి పాత్రల్లోనూ అలరించాడు