Tabu : ఆ హీరో రాత్రి గెస్ట్ హౌస్ కు రమ్మన్నాడు.. టబు సంచలన కామెంట్లు..!

Tabu

Tabu

Tabu : సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ అనేది అనాది కాలం నుంచి వినిపిస్తూనే ఉంది. కానీ దాని గురించి ఏనాడూ పెద్దగా ఎవరూ బయటకు మాట్లాడలేదు. అంతకు ముందు మాట్లాడితే అవకాశాలు తగ్గుతాయో అనే భయంలో ఎవరూ పెద్దగా స్పందించేవారు కాదు. కానీ ఇప్పుడు మాత్రం మీటూ ఉద్యమం తర్వాత అందరూ వరుసగా స్పందిస్తూ దానిపై అసంతృప్తిని బయట పెడుతున్నారు.

ఇలాంటి వారి లిస్టులోకి ఇప్పుడు సీనియర్ హీరోయిన్ టబు కూడా వచ్చి చేరిపోయింది. ఆమె గతంలో ఎంతోమంది అగ్ర హీరోలతో నటించి మెప్పించిన పేరు సొంతం చేసుకుంది. తర్వాత కాలంలో ఆమె సౌత్ ఇండస్ట్రీని వదిలేసి బాలీవుడ్ కు వెళ్లిపోయింది ఈ ముద్దుగుమ్మ. ఇప్పుడు అక్కడే ఉంటూ అప్పుడప్పుడు తెలుగులో అవకాశాలు వస్తే నో చెప్పకుండా చేసేస్తోంది.

ఈ క్రమంలోనే ఆమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని తనకు ఎదురైన కొన్ని చేదు అనుభవాలను బయట పెట్టేసింది. నేను గతంలో ఓ సినిమా షూటింగ్ కోసం బాలీవుడ్ లో ఓ చోటకు వెళ్లాను. అక్కడ హీరో నన్ను అసభ్యకరంగా ప్రవర్తించాడు. అతను షూటింగ్ సమయంలో నన్ను తాకరాని చోట తాకేందుకు ప్రయత్నాలు చేశాడు.

అంతే కాకుండా నన్ను అర్థరాత్రి సమయంలో ఫోన్ చేసి గెస్ట్ హౌస్ కు రమ్మనేవాడు. దాంతో నాకు చాలా అసహ్యంగా అనిపించింది. అప్పటి నుంచి ఆ హీరో సినిమాలో చేయడం మానేశాడు. అతనొక్కడే కాదు చాలామంది అప్పట్లో ఇలాగే నాతో ప్రవర్తించేవారు. కానీ నేను వాటిని అధిగమించి నా ట్యాలెంట్ తోనే ఈ స్థాయికి ఎదిగాను అంటూ చెప్పుకొచ్చింది టబు.

TAGS