JAISW News Telugu

Mudragada Padmanabha Reddy : ఇకపై ముద్రగడ పద్మనాభ రెడ్డి.. అధికారిక ప్రకటన విడుదల

Mudragada Padmanabha Reddy

Mudragada Padmanabha Reddy

Mudragada Padmanabha Reddy : వైసీపీ సీనియర్ నేత, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఎన్నికల టైంలో ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. అప్పుడు  చెప్పినట్లగానే తన పేరు మార్చుకున్నారు. ఈ మేరకు అధికారిక గెజిట్ నోటిఫికేషన్ విడుదలైంది. అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్‌ను ఓడించకపోతే తన పేరు మార్చుకుంటానని ముద్రగడ పద్మనాభం సవాల్ చేశారు. కానీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ భారీ మెజార్టీతో గెలవడంతో.. ఫలితాల తర్వాత మీడియా ముందుకు వచ్చిన ముద్రగడ తన సవాల్‌కు కట్టుబడి ఉన్నానంటూ ప్రకటించారు. ఈ మేరకు ముద్రగడ పద్మనాభ రెడ్డిగా పేరు మార్చినట్లు గెజిట్‌ విడుదలైంది.
 
ముద్రగడ పద్మనాభం ఏపీ ఎన్నికలకు ముందు జనసేన పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. పవన్ కళ్యాణ్ పార్టీలోకి ఆహ్వానిస్తే వెళదామని అనుకున్నారు.. అయితే పవన్ నుంచి ఆహ్వానం అందకపోవడంతో ముద్రగడ ఆయనకు ఘాటుగా లేఖ రాశారు. ఆ తర్వాత వైసీపీ నేతలు పద్మనాభం ఇంటికి వెళ్లి పార్టీలోకి రావాలని ఆహ్వానించారు. ముద్రగడ పద్మనాభం మార్చి 27న తనయుడితో కలిసి వైసీపీలో చేరారు.   పవన్ కళ్యాణ్‌ పోటీచేసిన పిఠాపురం నియోజకవర్గంలోని ఒక మండలంలో వైసీపీ బాధ్యతను ఆయనకు అప్పగించింది పార్టీ. అదే సమయంలో ముద్రగడ పద్మనాభం కుమార్తె క్రాంతి తండ్రితో విభేదించారు. ఈ మేరకు కొన్ని వీడియోలను విడుదల చేశారు. తండ్రి తీరుపై మండిపడ్డారు. ఈ పరిణామాలతో పవన్ కళ్యాణ్ తన కుటుంబంలో చిచ్చు పెట్టారని ముద్రగడ పద్మనాభం ఆరోపించారు. ఎన్నికల ఫలితాల తర్వాత ముద్రగడ పేరు మార్చుకోవడంపై సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ జరిగాయి. దీంతో ఆయన ప్రెస్‌మీట్ పెట్టి మరీ తన పేరును మార్చకునే పనిలో ఉన్నానని.. అందుకు అప్లై చేశానని చెప్పుకొచ్చారు.  సవాల్ చేసినట్లుగానే ఆయన పేరును ముద్రగడ పద్మనాభ రెడ్డిగా మార్చుకున్నారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది.

Exit mobile version