Hemant Soren : జార్ఖండ్ సీఎంగా హేమంత్ సోరెన్ ప్రమాణస్వీకారం
Hemant Soren : జార్ఖండ్ ముఖ్యమంత్రిగా జేఎంఎం చీఫ్ హేమంత్ గురువారం సాయంత్రం 5 గంటలకు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ విషయాన్ని అధికారులు ప్రకటించారు. ప్రభుత్వ ఏర్పాటుకు తనకు అవకాశం ఇవ్వాలని హేమంత్ కోరగా, గవర్నర్ సుముఖత వ్యక్తం చేయడంతో ఆయన నూతన సీఎంగా ప్రమాణస్వీకారం చేసేందుకు ఏర్పాట్లు చేశారు.
జేఎంఎం సారథ్యంలోని కూటమి ఎమ్మెల్యేలంతా బుధవారం సీఎం సంపయీ సోరెన్ నివాసంలో సమావేశమై హేమంత్ సోరెన్ ను తమ సభాపక్ష నేతగా ఎన్నకున్నారు. అనంతరం గవర్నర్ ను కలిసిన కూటమి ప్రతినిధి బృందంలో హేమంత్ సోరెన్ తో పాటు కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు రాజేష్ ఠాకూర్, మంత్రి సత్యానంద్ భుక్తా (ఆర్జేడీ), ఎమ్మెల్యే వినోద్ సింగ్ (సీపీఐ ఎంఎల్), హేమంత్ సతీమణి కల్పనా సోరెన్ తదితరులు ఉన్నారు.
భూ కుంభకోణం ఆరోపణలతో మనీలాండరింగ్ కేసులో 2024 జనవరి 31 హేమంత్ సోరెన్ ను ఈడీ అరెస్టు చేసింది. అంతకుముదు పార్టీ నేతల ఒత్తిడి కారణంగా ఆయన సీఎం పదవికి రాజీనామా చేశారు. జూన్ 28న జైలు నుంచి విడుదలైన సోరెన్ దాదాపు 5 నెలల తర్వాత మనీలాండరింగ్ కేసులో ఆయనకు బెయిల్ మంజూరైంది.