JAISW News Telugu

Actress Hema : రోజుకో మలుపు తిరుగుతున్న ‘హేమ’ వ్యవహారం

Actress Hema

Actress Hema

Actress Hema : రేవ్ పార్టీకి సంబంధించి సినీ నటి హేమ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతుంది. మొదట రేవ్ పార్టీకి వెళ్లలేదని బుకాయించిన హేమ. రెడ్ హ్యాండెడ్ గా దొరికిందని పోలీసులు సాక్షాలతో సహా బయటపెట్టడంతో ఒప్పుకోవాల్సి వచ్చింది. ఆమె నుంచి సేకరించిన బ్లడ్ షాంపిల్స్ లో కూడా డ్రగ్స్ ఉన్నట్లు ఫోరెన్సిక్ నివేదికలో వెల్లడైంది. దీంతో బెంగళూర్ పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు.

ఇప్పుడు మరో వాదన తెరపైకి వచ్చింది. ఈ పార్టీలో హేమనే కీరోల్ పోషించిందట. అందుకే ఆమెపై పోలీసులు నిఘా పెంచారట. దీనికి సంబంధించి ఆధారాలు ఉండడంతో ఈ కేసులో సీసీబీ పోలీసులు హేమను అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. దేశ వ్యాప్తంగా ఈ కేసు సంచలనంగా మారింది. కేసు నమోదు చేసిన తర్వాత ఆమె ఆరోగ్య కారణాల దృష్ట్యా కొన్ని రోజులు గడువు అడిగింది. గడువు ముగిసిన వెంటనే బెంగళూరు నుంచి వచ్చిన పోలీసులు హైదరాబాద్ లో ఉన్న ఆమెను అరెస్ట్ చేసి పరప్పన అగ్రహర జైలుకు తీసుకెళ్లారు. ప్రస్తుతం ఆమె అరెస్ట్ ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది.

దీనికి ముందు సీసీఐ పోలీసులు రెండు సార్లు నోటీసులు పంపించారట. వాటిని హేమ పట్టించుకోకపోవడంతో అరెస్ట్ చేయాల్సి వచ్చిందని పోలీసులు చెప్తున్నారు. అయితే, ఈ కేసులో మరికొంత మంది ఉన్నా ఎక్కువగా హేమ పేరే, అది కూడా పొరుగు రాష్ట్రానికి చెందిన నటి పేరు వినిపించడంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. అయితే, ఈ కేసులో ఆమె కీరోల్ పోషించిందని పోలీసులు చెప్తున్నారు.

ఈ కేసులో ఇప్పటి వరకు హేమతోపాటు మరో ఐదుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు రేవ్ పార్టీ నిర్వహణలో హేమ పాట్నర్ కావడంతో అదుపులోకి తీసుకున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. ప్రాథమిక ఆధారాలు లభ్యం కావడంతోనే హేమను అరెస్ట్ చేసి ఉంటారనే ప్రచారం జరుగుతోంది.

Exit mobile version