JAISW News Telugu

YCP Leader Hema : సుద్దపూస మాటలు మాట్లాడి నవ్వులపాలైన హేమ అలియాస్ కృష్ణవేణి

YCP Leader Hema

YCP Leader Hema

YCP Leader Hema : బెంగళూరు రేవ్ పార్టీ ఏపీలో ప్రకంపనలు రేపుతోంది. రేవ్ పార్టీలో పాల్గొని కూడా సుద్దపూస మాటలు మాట్లాడిన  క్యారెక్టర్ ఆర్టిస్టు, వైసీపీ మహిళ నేత హేమ వైఖరిపై సోషల్ మీడియాలో ట్రోల్స్ హల్ చల్ చేస్తున్నాయి. బెంగళూరు రేవ్ పార్టీలో తాను పాల్గొన్నట్లు వార్తలు రాగానే.. దాన్ని కవర్ చేయడానికి ఓ వీడియోను విడుదల చేసి మీడియాను పక్కదారి పట్టించింది. ఆ వెంటనే రేవ్ పార్టీలో హేమ ఉందంటూ ప్రకటించి ఆమెకు షాక్ ఇచ్చారు బెంగళూరు పోలీసులు.

రేవ్ పార్టీలో డ్రగ్స్ తీసుకున్నట్లు హేమ బ్లడ్ శాంపిల్ టెస్ట్ లో నిర్ధారణ అయ్యింది. దీంతో పోలీసులు ఆమెకు నోటీసులు పంపారు. అయితే ఈ ఘటనపై హేమ స్పందిస్తూ ‘‘ఏం చేస్తారో చేసుకోండి..సమయం వచ్చినప్పుడు నేను కూడా మాట్లాడుతా..’’ అంటూ మీడియాపై ఆగ్రహం వ్యక్తం చేసింది.  కాగా, ఈ రేవ్ పార్టీలో హేమ తన పేరును కృష్ణవేణిగా మార్చుకుంది. అయితే హేమ అసలు పేరు కూడా కృష్ణవేణే.  

హేమకు నోటిదూల గతం నుంచే ఉందనేది అందరికీ తెలిసిందే. గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటోంది. కానీ హఠాత్తుగా రేవ్ పార్టీలో ప్రత్యక్షమై డ్రగ్స్ తీసుకుని డ్రగ్స్ తీసుకుని దొరికిపోవడం అందరిని షాక్ కు గురిచేసింది. సినిమాల్లోనూ, మీడియాలోనూ సుద్దపూస మాటలు మాట్లాడుతూ వీరు చేసేది ఈ పనా? అని జనాలు నవ్వుకుంటున్నారు. ఇక హేమ  వైసీపీలో ఉన్న విషయం తెలిసిందే. అయితే ఈ రేవ్ పార్టీలో వైసీపీ నేతలు ఉన్నారనే వార్తలు రావడం, హేమ వైసీపీలో ఉండడాన్ని చూస్తే పోలీసుల విచారణలో మరెన్నో కీలక విషయాలు బయటపడే అవకాశం ఉంది.

ఇక  జగన్ రెడ్డి పాలనలో ఏపీ గంజాయికి రాజధానిగా మారింది. ఇక్కడ సరిపోలేదు అన్నట్టుగా ఏపీకి చెందిన ప్రజాప్రతినిధులు, సినిమా నటులు బెంగళూరుకు వెళ్లి అక్కడ డ్రగ్స్ తీసుకుంటున్నారంటే పరిస్థితి ఎంతలా దిగజారిందో అర్థమవుతోంది. రాబోయే ప్రభుత్వమైనా డ్రగ్స్ దందాను పూర్తిగా అరికట్టి ఏపీ యువత భవిష్యత్ ను కాపాడాల్సిన అవసరముంది. అలాగే డ్రగ్స్ అమ్మినా, తీసుకున్నా..కఠిన శిక్షలు అమలు చేయాలి.

Exit mobile version