CM Jagan : రాయి దాడి నేపథ్యంలో సిఎం జగన్ భద్రత విషయంలో బారి మార్పులు చేశారు. ప్రస్తుతం ఉన్న భద్రతకు అదనంగా సెక్యూరిటీని ఏర్పాటు చేసి.. బస్సుయాత్ర మార్గాల్లో డిఎస్పీలతో భద్రత కల్పించనున్నారు. సిఎం పయనించే మార్గాలను సెక్టార్లుగా విభజించి, సెక్టారరుకు ఒక డిఎస్పీ, ఇద్దరు సిఐలు, నలుగురు ఎస్ఐలతో సెక్యూరిటీ కల్పిస్తారు.
ఇకపై నిర్దేశించిన ప్రాంతాల్లోనే సిఎం రోడ్ షోలు, సభలు ఉండనున్నాయి. రాయి దాడి తర్వాత తొలిసారి జగన్ బయటకు వచ్చారు. సిఎం జగన్ ‘మేమంతా సిద్ధం’ 15వ రోజు బస్సుయాత్ర ఈరోజు ప్రారంభమైంది. బస్సయాత్ర ప్రారంభానికి ముందు పలువురు నేతలు ఆయనను కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా సిఎం జగన్ వారితో నవ్వుతూ మాట్లాడారు. జగన్ కంటి ప్రాంతంలో కొంత వాపు కనిపిస్తుండగా దానిపై బ్యాండేజ్ ఉంది.