JAISW News Telugu

Heavy Rains : ఉత్తరాఖండ్ లో భారీ వర్షాలు.. చిక్కుకుపోయిన 50 మంది యాత్రికులు

Heavy Rains

Heavy Rains

Heavy Rains : గత రెండు రోజులుగా ఉత్తరాఖండ్ లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలకు పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడుతున్నాయి. మరోవైపు ప్రముఖ పుణ్యక్షేత్రాలను సందర్శించేందుకు వెళ్లిన యాత్రికులు చిక్కుకుపోయారు. రుద్రప్రయాగ్ జిల్లాలోని మద్మహేశ్వర్ ఆలయం సమీపంలో సుమారు 50 మంది యాత్రికులు చిక్కుకుపోయినట్లు స్థానిక అధికారులు తెలిపారు. ఈ ప్రాంతంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు మార్కండ నదిపై నిర్మించిన తాత్కాలిక వంతెన కొట్టుకుపోయినట్లు పేర్కొన్నారు. దీంతో ఆలయానికి వెళ్లిన భక్తులు అక్కడ చిక్కుకుపోయినట్లు వెల్లడించారు. సమాచారం అందుకున్న రెస్క్యూటీం యాత్రికులను కాపాడేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు.

మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు అధికారులు అప్రమత్తమయ్యారు. ముందు జాగ్రత్త చర్యగా పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించారు. వర్షాల కారణంగా కొండ చరియలు విరిగిపడే అవకాశం ఉందని.. ప్రజలు కొండ ప్రాంతాలకు దూరంగా ఉండాలని సూచించారు.

Exit mobile version