JAISW News Telugu

Heavy rains : తెలంగాణలో భారీ వర్షాలు.. రెడ్ అలర్ట్ ప్రకటించిన వాతావారణ శాఖ

Heavy rains

Heavy rains

Heavy rains : తెలంగాణలో మరో రెండు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్ తో సహా మరో పది జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. శని, ఆదివారాలు ఈ రెండు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం ప్రభావంతో కొన్ని చోట్ల కుండపోత వర్షాలు పడనున్నట్లు వాతావరణ శాఖ స్పష్టం చేసింది.

జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు పడతాయని హెచ్చరించింది. నల్గొండ, నాగర్ కర్నూలు, వనపర్తి, జోగులాంబ గద్వాల్, నారాయణపేట జిల్లాల్లో భారీ వర్షాలు పడుతాయని తెలిపింది. మిగతా జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. శనివారం మధ్యాహ్నం వరకు నారాయణపేటలో అత్యధికంగా 13 సెంటిమీటర్ల వర్షం నమోదైంది. ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి.

రాష్ట్ర వ్యాప్తంగా 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముంది. బంగాళాఖాతంలోని వాయుగుండం ఆదివారం (సెప్టెంబరు 1) తెల్లవారుజామున విశాఖపట్నం, గోపాలపూర్ ప్రాంతాల మధ్య తీరం దాటనుంది. వాయుగుండం తీరం దాటిన 24 గంటల వరకు తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడనున్నట్లు వాతావరణ శాఖ స్పష్టం చేసింది.

Exit mobile version