Heavy Rains : ముంబైలో భారీ వర్షాలు.. నలుగురి మృతి

Heavy rains
Heavy rains in Mumbai : ముంబైని భారీ వర్షాలు ముంచెత్తాయి. బుధవారం సాయంత్రం నుంచి గురువారం తెల్లవారు జాము వరకు కురిసిన వర్షాల వల్ల వివిధ ఘటనల్లో నలుగురు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. పలు ప్రాంతాల్లో 275 మి.మీ. వర్షపాతం నమోదైనట్లు వెల్లడించారు. వర్షాల కారణంగా ముంబైలోని అన్ని విద్య సంస్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. అలాగే పలు రైల్వే సేవలను సైతం కాసేపు అధికారులు నిలిపివేశారు. గోవండి, మన్ ఖుర్ద్ మధ్య వరద తగ్గిన తర్వాత లోకల్ రైళ్లను తిరిగి ప్రారంభించారు.
అంధేరి, కుర్లా ఈస్ట్, నెహ్రూ నగర్, చెంబూర్ తో సహా పలు ప్రాంతాలు కుండపోత వర్షాల కారణంగా ట్రాఫిక్ కు అంతరాయం కలిగింది. ప్రతికూల వాతావరణం కారణంగా ముంబై విమానాశ్రయం నుంచి 14 విమానాలను దారి మళ్లించారు. పలు విమానాల ల్యాండింగ్ కు అనుమతి రద్దు చేశారు.