JAISW News Telugu

Chennai : చెన్నైలో భారీ వర్షాలు.. ఫ్లై ఓవర్లపై కార్లు పార్క్ చేస్తున్న ప్రజలు.. కారణం ఇదే

Chennai

Chennai

Chennai : 2015లో కురిసిన భారీ వర్షాలు చెన్నై వాసులకు ఇప్పటికీ పీడకలగానే మిగిలిపోయాయి. వందలాది కార్లు, ద్విచక్ర వాహనాలు వరదల్లో కొట్టుకుపోయాయి. ఇప్పుడు మళ్లీ తుపాను ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తుండడంతో వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. కొత్త పార్కింగ్ స్థలాలను ఎంపిక చేస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడుతోంది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ సహా తమిళనాడులోని కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. చెన్నైలోని కోయంబేడుతో పాటు నగరంలోని పలు ప్రాంతాల్లో నిన్నటి నుంచి భారీ వర్షపాతం నమోదైంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. తిరువళ్లూరు నగరంలోని కొన్ని ప్రాంతాలు కూడా జలమయమయ్యాయి. భారీ వర్షాల కారణంగా చెన్నైలోని చెంగల్‌పట్టచ్చు, కాంచీపురం, తిరువళ్లూరు జిల్లాల్లో పాఠశాలలు, కళాశాలలకు ఇప్పటికే సెలవులు ఇచ్చారు. ఐటీ సిబ్బంది కూడా ఇంటి నుంచే వర్క్ చేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. మరో మూడు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని తెలుస్తోంది. ముఖ్యంగా ఈ నెల 17వ తేదీ నాటికి వాయగుండం తుపానుగా బలపడి చెన్నై-నెల్లూరు మధ్య తీరం దాటుతుందని, దీంతో మరిన్ని భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

చెన్నై నగరంలోని ప్రధాన ప్రాంతాలతో పాటు శివారు జిల్లాలను అధికారులు, మంత్రులు పర్యవేక్షిస్తున్నారు. చెన్నై సహా ఇతర ప్రాంతాల్లో 40 సెంటీమీటర్ల వర్షం కురిసే సూచనలు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. 2015 వరదల భయం వెంటాడకుండా ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. వరదల నుంచి ఇళ్లను కాపాడే మార్గం లేకున్నా… వాహనాలను కాపాడేందుకు కనీసం కొత్త పద్ధతులు పాటిస్తున్నారు. అందుకే ఫ్లై ఓవర్లపై కార్లు పార్క్ చేస్తున్నారు.  లోతట్టు ప్రాంతాల ప్రజలు వరదలకు కొట్టుకుపోకుండా తమ కార్లను తీసుకొచ్చి ఫ్లైఓవర్‌కు ఒకవైపు పార్క్ చేసి వెళ్లిపోతున్నారు. దీన్ని చూసి మరికొందరు కూడా తమ తమ ప్రాంతాల్లోని ఫ్లై ఓవర్లపై కార్లను ఎక్కిస్తున్నారు.

Exit mobile version