JAISW News Telugu

AP Rains : ఏపీలో భారీ వర్షాలు.. పిడుగులు పడతాయి జాగ్రత్త!

AP Rains

AP Rains

AP Rains : ఏపీలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. రానున్న మూడు రోజులు ఉత్తర కోస్తాలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రాయలసీమ దక్షిణ కోస్తాలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. వర్షాలు కురిసే సమయంో 30 నుంచి 40 కి.మీ.ల వేగంతో గాలులు వీస్తాయని, పలు ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉన్నట్లు అధికారులు హెచ్చరించారు.

శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, పశ్చిమగోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, కర్నూలు, నంద్యాల, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకావముందని వాతావరణ శాఖ ప్రకటించింది.

తిరుపతి జిల్లాలో ఈరోజు రాత్రి అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. చాలా చోట్ల ఈదురుగాలులు వీస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.

Exit mobile version