Heavy Rains : భారీ వర్షాలు.. గండిపోచమ్మ ఆలయం వద్దకు గోదావరి వరద
Heavy Rains : ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అల్లూరి సీతారామరాజు జిల్లా దేవీపట్నం మంలం గొందూరు గ్రామంలో భారీ వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. మరోవైపు గోదావరి నదిలో వరద పోటెత్తింది. దీంతో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం గండి పోచమ్మ ఆలయాన్ని వరదనీరు తాకింది. అమ్మవారి దేవస్థానం మండపం సమీపానికి వరద పోటెత్తింది. స్నానాల ఘాటు వద్ద మెట్లు పూర్తిగా నీటిలో మునిగాయి. ఆలయానికి వెళ్లే రోడ్డు మార్గంలో దండింగి గ్రామం వద్ద రోడ్డుపైకి భారీగా వరదనీరు చేరింది. అయితే, ముందస్తు సమాచారం లేకపోవడంతో ఆలయానికి వెళ్లే రోడ్డు మార్గం లేక భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
తెలంగాణలోని భద్రాచలం, బూర్గంపాడు, చర్ల, దుమ్ముగూడెంలో వర్షాలు కురుస్తున్నాయి. భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 21 అడుగుకు చేరింది. గద్వాలలో జూరాల ప్రాజెక్టుకు వరద ప్రవాహం పెరుగుతోంది.