Heavy rains : తమిళనాడులో మళ్లీ భారీ వర్షాలు కురుస్తున్నాయి. చెన్నైలో తెల్లవారుజామున నుంచి భారీ వర్షం కురుస్తున్నది. దీంతో టినగర్,వేలాచ్చేరి,అన్నా నగర్, సహా మెరీనా పరిసరాలను జల ప్రళయంలో చిక్కుకుపోయాయి. చెన్నై,తిరువళ్ళూరు, కాంచిపురం,చెంగల్ పట్టు జిల్లాలోని విద్యా సంస్థలకు రాష్ట్ర విద్యాశాఖ సెలవులు కూడా ప్రకటించింది.
కంచి, తిరువళ్లూరు, చెంగల్‌పట్టు రాణిపేట్, వేలూరు, విరుదునగర్, తిరుపత్తూరు, ధర్మపురి, కృష్ణగిరి, కరూర్, తిరువణ్ణామలై, తిరుచ్చి, శివగంగై, రామనాథపురం, పుదుకోట్టై, తంజావూరు, తిరువారూరు, నాగై, మైలాడుతురై, కడలూరు, కల్లకూరిచి, విల్లుపురం తదితర జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి.
అయితే.. భారీ వర్ష సూచనతో వేలాది కార్లు ఫ్లైఓవర్ లు ఎక్కాయి. భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో చెన్నై, వేలచేరి పరిసరాల్లో ఫ్లైఓవర్లపై కార్లను పార్క్ చేశారు. గతంలో కురిసిన భారీ వర్షాలు, వరదల వల్ల కార్లు ఎందుకు పనిరాకుండా పోయాయని అంటున్నారు స్దానికులు. ఇక అపార్ట్ మెంట్లు, సెల్లార్ల నుంచి వాహనాలను బయటకు తీయడం లేదు. ఒక కొందరైతే ఏకంగా తమ ఫ్లాట్ల ముందే వాహనాలు చేయడం కనిపించింది. ఈ ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి.