JAISW News Telugu

Heavy Rain : హైదరాబాద్ లో కుండపోత వర్షం

Heavy Rain

Heavy Rain

Heavy Rain : హైదరాబాద్ పట్టణాన్ని పూర్తిగా నల్లటి మేఘాలు కమ్మేశాయి. మధ్యాహ్నం వరకు ఉక్కబోత వాతావరణం ఉండగా 3 గంటల తర్వాత ఒక్కసారిగా మారిపోయింది. ఆకాశాన్ని కారు మబ్బులు కమ్మేసి కుండపోత వర్షం ప్రారంభమైంది.

జూబ్లీహిల్స్, బంజారహిల్స్, హైటెక్ సిటీ, కొండాపూర్, గచ్చిబౌలి, లింగంపల్లి, కూకట్ పల్లి, ఎర్రగడ్డ, అమీర్ పేట, పంజాగుట్ట, ఖైరతాబాద్, లక్డీకాపూల్, నాంపల్లి, సికింద్రాబాద్, అల్వాల్, బాల్ నగర్, బోయిన్ పల్లి, దిల్ సుఖ్ నగర్, ఎల్బీ నగర్ లలో వర్షం ఏకధాటిగా కురుస్తోంది. రూడ్లపై వర్షం నీరు నిలిచిపోవడంతో పలుచోట్ల ట్రాఫిక్ జామ్ అయ్యింది.

తెలంగాణకు వాతావరణ శాఖ రెయిన్ అలర్ట్ జారీ చేసింది. రానున్న 3 రోజులు రాష్ట్రంలో వానలు పడే అవకాశముందని అధికారులు తెలిపారు. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని అన్నారు. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడే అవకాశం ఉందని హెచ్చరించారు. ఈరోజు, రేపు కొన్ని జిల్లాలకు ఎల్లె అలర్ట్ వాతావారణ శాఖ అధికారులు ప్రకటించారు.

Exit mobile version