Hyderabad Rain : హైదరాబాద్ లో భారీ వర్షం.. మరో మూడు రోజులు వానలు

Hyderabad Rain
Hyderabad Rain : హైదరాబాద్ లో శుక్రవారం యభారీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మాదాపూర్, గచ్చిబౌలి, బంజారాహిల్స్, చార్మినార్, కొత్తపేట, చాదర్ ఘాట్, మలక్ పేట్, ఎల్ బీ నగర్ తదితర ప్రాంతాల్లో మధ్యాహ్నం వర్షం కురిసింది.
తెలంగాణ రాబోయే మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. రాష్ట్రంలోని కొమురం భీం, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ఆదిలాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.