Dubai : ఎడారి దేశంలో వర్షాలు తక్కువగా పడుతుంటాయి. ఎప్పుడో ఒకసారి భారీ వర్షాలు కురుస్తాయి. అలాంటి యునైటెడ్ అరబ్ ఎమిరైట్స్ లో అకాల వర్షాలు బీభత్సం సృష్టించాయి. మంగళవారం ఉరుములు, మెరుపులతో ప్రారంభమైన వాన కుంభవృష్టిగా మారింది. దీంతో చాలా ప్రాంతాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. జనజీవనం పూర్తిగా స్తంభించింది.
కొన్ని గంటలు కురిసిన వానతో ఏడాదిన్నరలో నమోదయ్యే వర్షపాతం నమోదయింది. దీంతో దుబాయ్ ఎయిర్ పోర్టు వర్షపు నీటితో మునిగిపోయింది. విమానాల రాకపోకలు నిలిచిపోయి ప్రయాణికులు ఎయిర్ పోర్టులోనే చిక్కుకుపోయారు. వరద ధాటికి ప్రధాన రహదారులు దెబ్బతిన్నాయి. దుబాయ్ లో142 మిల్లి మీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు ప్రకటించారు. రాతి ఎడారిగా పేరున్న ఎమిరేట్ ఆఫ్ పుజైరాలో 145 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది.
యుఏఈలో ఇంత భారీ వర్షాలు పడడం చాలా అరుదు. గత 2, 3 ఏళ్లుగా అప్పుడప్పుడు ఇలా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణంలో చోటు చేసుకుంటున్న మార్పుల ప్రభావంతో ఇలాంటి పరిస్థితులు సంభవిస్తున్నాయని వాతావరణ నిపుణులు పేర్కొంటున్నారు.
#Dubai flood is not a jokepic.twitter.com/lXJC0PLrWe
— Prince Nishat (@teasersixer) April 17, 2024