JAISW News Telugu

Bhadrachalam : భద్రాచలంలో భారీ వర్షం.. వీధుల్లో వరదనీరు

FacebookXLinkedinWhatsapp
Bhadrachalam

Bhadrachalam

Bhadrachalam Floods : భద్రాచలంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వీధులన్ని వరదనీటితో నిండిపోయాయి. పట్టణంలోని శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయం వద్దకు భారీగా వరదనీరు చేరింది. అన్నదాన సత్రం పక్కనే ఉన్న డ్రైనేజీ పొంగిపొర్లుతోంది. పడమర మెట్ల వైపు మోకాలు లోతు నీరు చేరడంతో భక్తులు వెళ్లేందుకు వీలు లేకుండా పోయింది. కరకట్ట వద్ద లూయిస్ ను మూసి ఉంచడంతో వర్షపునీరు డ్రైనేజీ గుండా గోదావరిలో కలవక పోవడంతో కాంప్లెక్స్ లో వర్షపునీటితో పాటు మురుగు నీరు చేరింది. కరకట్ట విస్తా కాంప్లెక్స్ వద్ద ఉన్న మోటార్లను ఆన్ చేయడంతో మురుగునీటిని డంపింగ్ చేస్తున్నారు. రోడ్డు పక్క దుకాణాల్లోకు వర్షపు నీరు చేరడంతో ఇబ్బందులు పడుతున్నారు.

భద్రాచలం వద్ద గోదావరిలో మళ్లీ క్రమంగా పెరుగుతోంది. ఎగువ ప్రాంతాల్లోని ఇంద్రావతి వైపు నుంచి వరద చేరుతోంది. దీంతో నీటిమట్టం పెరుగుతున్నట్లు అధికారులు తెలిపారు.

Exit mobile version