JAISW News Telugu

Nagarjunasagar : నాగార్జునసాగర్ కు భారీగా వరద.. ఆరు గేట్లు ఎత్తి నీరు విడుదల

Nagarjunasagar : ఎట్టకేలకు నాగార్జునసాగర్ గేట్లు తెరుచుకున్నాయి. శ్రీశైలం నుంచి వరద ప్రవాహం పోటెత్తడంతో నిండుకుండలా మారిన సాగర్ డ్యాం ఆరు గేట్లను ఈరోజు (సోమవారం) ఉదయం అధికారులు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. ఈ సందర్భంగా సాగర్ ఎస్ఈ నాగేశ్వర రావు, సీఈ అనిల్ కుమార్ కృష్ణమ్మకు జలహారతి ఇచ్చి, ఆరు రేడియల్ క్రస్ట్ గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. అంతకుముందు దిగువ ప్రాంతాల ప్రజల అప్రమత్తత కోసం సైరన్ ను మోగించారు.

ప్రస్తుతం ప్రాజెక్టుకు ఇన్ ఫ్లో 3,23,748 క్యూసెక్కులు ఉండగా, ఔట్ ఫ్లో 83,331 క్యూసెక్కులుగా ఉంది. సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు ఉండగా, ప్రస్తుత నీటి మట్టం 582.70 అడుగులకు చేరింది. 312.50 టీఎంసీల పూర్తి నీటి నిల్వ సామర్థ్యానికి ప్రస్తుతం 290.51 టీఎంసీల నీరు నిల్వ ఉంది. నీటి విడుదల దృశ్యాన్ని వీక్షించేందుకు పెద్ద సంఖ్యలో పర్యాటకులు తరలివచ్చారు.

Exit mobile version