JAISW News Telugu

Seized gold : ప్రైవేట్ బస్సులో భారీగా బంగారం పట్టివేత

FacebookXLinkedinWhatsapp
Seized gold

Seized gold

seized gold : సంగారెడ్డి జిల్లాలో పోలీసులు ఓ ప్రైవేటు ట్రావెల్ బస్సులో భారీగా బంగారం పట్టుకున్నారు. మునిపల్లి మండలం కంకోల్ టోల్ ప్లాజా వద్ద జాతీయ రహదారిపై ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో తనిఖీలు చేపట్టిన్న టాస్క్ ఫోర్స్ పోలీసులకు సుమారు 4.8 కిలోల బంగారు ఆభరణాలను పట్టుబడ్డాయి. ముంబై నుంచి హైదరాబాద్ కు వీటిని తరలిస్తున్నట్లు గుర్తించారు. సరైన పత్రాలు లేకపోవడంతో చంద్రేష్ అనే వ్యక్తి నుంచి ఈ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. బంగారంతో పాటు తరలిస్తున్న వ్యక్తిని సంగారెడ్డి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఆభరణాలకు సంబంధించి సరైన రికార్డులు లేకపోవడంతో అదంతా వ్యాపారులు బ్లాక్ దందాలో భాగంగా రవాణా చేస్తున్నట్లు పోలీసులు భావిస్తున్నారు.

Exit mobile version