TS Assembly:తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడీ వేడిగా సాగుతున్నాయి. గురువారం తెలంగాణ విత్యుత్తు రంగం పరిస్థితిపై శాసన సభలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మాజీ మంత్రి జగదీష్‌రెడ్డిల మధ్య వాడీ వేడీ జర్చ జరిగింది. వరిద్దరి మధ్య జరిగిన మాటల యుద్ధం అసెంబ్లీని రణరంగాన్ని తలపించింది. యాదాత్రి ధర్మల్ పవర్ ప్రాజెక్టులో పెద్ద కుంభకోణం జరిగిందని, రూ.10 వేల కోట్లను మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి తిన్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన ఆరోపణలు చేశారు.
`భారాసా సర్కారు 24 గంటల కరెంట్ ఎప్పుడూ ఇవ్వలేదు. సబ్‌స్టేషన్‌లలో లాగ్ బుక్ చూస్తే ఇదంతా తెలుస్తుంది. నేను వెళ్లిన తరువాత లాగ్ బుక్‌లు లేకుండా చేశారు. రూ.10 వేల కోట్ల కుంభకోణం జరిగింది కాబట్టే నష్టాలు వస్తున్నాయి` అంటూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫైర్ అయ్యారు. దీనికి మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి గట్టి కౌంటర్ ఇచ్చారు. తనపై వస్తున్న ఆరోపణలపై సిట్టింగ్ జడ్జితో విచారణకు ఆదేశించాలని సవాల్ విసిరారు.
యాదాద్రి ప్రాజెక్టులో కుంభకోణం జరిగిందన్నది అవాస్తవం. భారాస పాలనలో విత్యుత్తు సరఫరా విషయంలో నాణ్యతను పెంచామన్నారు. అన్ని రంగాలకు 24 గంటల విద్యుత్ అందించామన్నారు. మా హయాంలో అర ఎకరం కూడా ఎండలేదన్నారు. విద్యుత్‌పై ధర్నాలు చేసే అవకాశమే మేము ఇవ్వలేదన్నారు. మా హయాంలో ఒక్కరోజు కూడా పవర్ హాలీడే ఇవ్వలేదన్నారు. ఈ సభలో ఉన్న ప్రతి ఒక్కరికీ అప్పులు ఉన్నాయి. అప్పులు ఉన్నంత మాత్రాన మనందరం చెడ్డవాళ్లమా?` అంటూ కౌంటర్ ఇచ్చారు.