Heart attack : వేదికపైనే గుండెపోటు.. కుప్పకూలిన రాముడి పాత్రధారి

Heart attack
Heart attack : దేశవ్యాప్తంగా శరన్నవరాత్రులు శోభాయమానంగా జరుగుతున్నాయి. ఉత్తరాదిన నవరాత్రి వేడుకల్లో భాగగా ‘రామలీల’ను ప్రదర్శిస్తుంటారు. రాజధాని ఢిల్లీలోని ఒక ప్రాంతంలో ‘రామలీల’ ప్రదర్శిస్తుండగా వేదికపై విషాదం చోటు చేసుకుంది. ఢిల్లీలోని షహదారా ప్రాంతంలోని విశ్వకర్మ నగర్ లో వేదికపై రామలీల ప్రదర్శిస్తుండగా రాముడి పాత్ర పోషిస్తున్న ఓ కళాకారుడు గుండెపోటుతో మృతి చెందాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. రాముని పాత్ర పోషిస్తున్న నటుని పేరు సుశీల్ కౌశిక్ (45) స్టేజీపై డైలాగులు చెప్పడం వీడియోలో కనిపిస్తుంది. ఈ సమయంలో, అతనితో పాటు ఇతర కళాకారులు కూడా వేదికపై ఉండటాన్ని చూడవచ్చు.
అంతలోనే అకస్మాత్తుగా సుశీల్ తన గుండెపై చేయి వేసుకొని స్టేజీ వెనుక వైపు వెళ్లడం కనిపిస్తుంది. పోలీసులు తెలిపిన ప్రకారం.. వేదికపై రాముని పాత్రధారి సుశీల్ కు గుండెపోటు రావడంతో ఆస్పత్రికి తరలించారు. అక్కడ సుశీల్ మృతి చెందాడు. సుశీల్ కౌశిక్ వృత్తిరీత్యా ప్రాపర్టీ డీలర్ అని తెలుస్తోంది