Kejriwal Bail : కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్‌పై విచారణ.. 17కు వాయిదా

Kejriwal Bail
Kejriwal bail : ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్‌పై ఇవాళ హైకోర్టు లో విచారణ సాగింది. వీటిపై కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐకి న్యాయమూర్తి నోటీసులు ఇచ్చారు. తదుపరి విచారణను ఈ నెల 17కు వాయిదా వేశారు. దర్యాప్తు ముసుగులో సీబీఐ తనను వేధిస్తోందని కేజ్రీవాల్ పిటిషన్‌లో పేర్కొన్నారు. తనను అరెస్టు చేయడం చట్టవిరుద్ధమని అన్నారు.
ఈ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను జూన్ 26న సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) అరెస్టు చేసింది. ప్రస్తుతం ఆయన జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు.