Covid 19:తెలంగాణలో కరోనా మళ్లీ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. గడిచిన 24 గంటల్లో తెలంగాణలో కొత్తగా 6 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు పాజిటివ్ కేసుల సంఖ్య 14కు చేరింది. రాష్ట్రంలో గత24 గంటల్లో కోవిడ్‌తో ఒకరు మృతి చెందారు. ఈ మేరకు తెలంగాణ వైద్యఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. రాష్ట్రంలో మళ్లీ కోవిడ్ కేసులు పెకుగుతున్న నేపథ్యంలో సన్నద్దంగా ఉండాలని మంత్రి దామోదర రాజనర్సింహ..వైద్య ఆరోగ్యశాఖ సిబ్బందిని ఆదేశించారు.
కేంద్రమంత్రి మన్‌సుఖ్ మాండవీయ అన్ని రాష్ట్రాల మంత్రులతో కోవిడ్ సన్నద్ధతపై బుధవారం వీడియో కాన్షరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న మంత్రి రాజనర్సింహ అనంతరం రాష్ట్ర స్థాయి సమావేశం నిర్వహించారు. హెల్త్ సెక్రెటరీ క్రిస్టినా, డీహెచ్ రవీంద్రనాయక్, డీఎంఈ త్రివేణి, గాంధీ ఆసుపత్రి సూరింటెండెంట్ రాజారావు, ఉస్మానియా సూరింటెండెంట్ నాగేంద్రక సహా పలువురు అధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి గురువారం అన్ని ప్రధాన ఆసుపత్రుల్లో మాక్ డ్రీల్ పూర్తి చేయాలన్నారు. ఆసుపత్రులకు అవసరమైన డీఎస్ఎంఎస్ ఐడీసీ ద్వారా తీసుకోవాలని చెప్పారు. లక్షణాలు ఉంటే కోవిడ్ పరీక్షలు చేయాలనిస్పష్టం చేశారు. పాజిటివ్ వచ్చిన కోవిడ్ నమూనాలను విధిగా ఉప్పల్‌లోని సీడీఎఫ్‌డీకి పంపాలన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం పాజిటివిటీ రేటు కేవలం 0.31 శాతం ఉన్నట్టు తెలిపారు.