Health Benefits of Dry Fruits : ప్రస్తుత రోజుల్లో చాలా మంది మధుమేహం, రక్తపోటు జబ్బులతో బాధపడుతున్నారు. చిన్న వయసులోనే వీటి బారిన పడి జీవితాంతం హలో లక్ష్మణా అంటూ కాలం గడుపుతున్నారు. ఇవి ఒకసారి వచ్చాయంటే జీవితాంతం మన వెంట ఉండాల్సిందే. మనం జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. లేకపోతే ప్రాణాలకే ప్రమాదం. షుగర్, బీపీతో చాలా మంది ప్రాణాలు కోల్పోయిన వారుండటం గమనార్హం.
మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో డ్రై ఫ్రూట్స్ కీలక పాత్ర వహిస్తాయి. ఇందులో ఉండే ప్రొటీన్లు మనకు ఎన్నో లాభాలు తీసుకొస్తాయి. ఇందులో విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు, సహజ చక్కెర, ఫైబర్ అధికంగా ఉండటం వల్ల మన శరీరానికి రక్షణనిస్తాయి. డయాబెటిస్ ను నియంత్రణలో ఉంచడంలో ఇవి కీలక పాత్ర వహిస్తాయి. ప్రొటీన్, మెగ్నిషియం, ఐరన్, ఫోలేట్, విటమిన్ ఎ,సి, కె వంటివి ఉండటం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
అంజీరా పండ్లు ఇన్సులిన్ ఉత్పాదకతను పెంచుతాయి. షుగర్ ను కంట్రోల్ లో ఉంచుతాయి. యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండటం వల్ల బరువు తగ్గేందుకు కూడా సాయపడతాయి. వీటి వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు దక్కుతాయి. రోజు వారీ ఆహారంలో అంజీరా తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మేలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
మన ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం ఉత్తమం. ఇందులో ఎండు ద్రాక్ష, ఎండు ఖర్జూరాలు, జీడిపప్పు, బాదంపప్పులు ముఖ్యమైనవి. వీటితో మన శరీరం ఎంతో ఉత్తేజితంగా మారుతుంది. బీపీ, షుగర్ ను నియంత్రించడంలో కూడా ఇవి ప్రధాన పాత్ర పోషిస్తాయి. డ్రై ఫ్రూట్స్ తీసుకుని ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని గుర్తుంచుకోవాలి.