JAISW News Telugu

LSG Vs DC : లక్నో.. ఢిల్లీ క్యాపిటల్స్ కు చావో రేవో

LSG Vs DC

LSG Vs DC

LSG Vs DC : లక్నో సూపర్ గెయింట్స్, ఢిల్లీ క్యాపిటల్స్ కు చావో రేవో లాంటి మ్యాచ్ సాయంత్రం అరుణ్ జైట్లీ మైదానంలో జరగనుంది. ఢిల్లీ 13 మ్యాచులు ఆడి ఆరు విజయాలు, ఏడు ఓటములతో దాదాపు ప్లే ఆప్స్ ఆశలు మిణుకు మిణుకు మంటున్నాయి.  దీంతో ఈ మ్యాచ్ లో భారీ తేడాతో గెలిచి ప్లే ఆప్స్ రేసులో నిలవాలని అనుకుంటోంది. కానీ ఇప్పటికే సన్ రైజర్స్, చెన్నై, 14 పాయింట్లతో ప్లస్ రన్ రేట్ తో టాప్ 4 లో ఉన్నాయి. కాబట్టి ఈ మ్యాచ్ లో భారీ విజయం సాధిస్తేనే ఢిల్లీకి  ప్లే ఆప్స్ కు ఏమైనా  అవకాశాలు మెరుగుపడతాయి.

లక్నో సూపర్ గెయింట్స్ పరిస్థితి మరోలా ఉంది. సీజన్ ఆరంభంలో దూకుడుగా ఆడిన లక్నో.. చివరికి వచ్చే సరికి తడబడుతోంది. లక్నో ఇప్పటివరకు 12 మ్యాచుల్లో ఆరు విజయాలు, ఆరు ఓటములతో 7 వ స్థానంలో ఉంది. ఢిల్లీతో జరిగే మ్యాచులో గనక లక్నో ఓడితే ఇంటి దారి పట్టాల్సిందే. ఎందుకంటే ఇప్పటికే నెట్ రన్ రేట్ లో బాగా వెనకబడిన లక్నో ఈ మ్యాచ్ లో తప్పకుండా గెలిస్తేనే.. ప్లే ఆప్స్ కు చేరే అవకాశాలు ఉంటాయి.

రెండు జట్లు ఎలాగైనా ఈ మ్యాచ్ గెలవాలని భావిస్తున్నాయి. లక్నో బౌలర్లు గత మ్యాచులో దారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. లక్నో యజమాని సంజీవ్ గోయెంకా.. కెప్టెన్ ల మధ్య జరిగిన సంభాషణ వైరల్ గా మారడంతో కే ఎల్ రాహుల్ కెప్టెన్సీ నుంచి తప్పుకుంటాడని వార్తలు వస్తున్న నేపథ్యంలో లక్నో ఎలాంటి ప్రదర్శన ఇస్తుందోననే అందరూ చర్చించుకుంటున్నారు.

గత రెండు సీజన్లలో ప్లే ఆప్స్ కు చేరిన లక్నో ఈ సారి కూడా చివరి రెండు మ్యాచులు గెలిచి ప్లే ఆప్స్ లో ఉండాలని అనుకుంటోంది. లక్నో అవకాశాలు కూడా అలా ఉన్నాయి. రెండు మ్యాచులు భారీ విజయం సాధిస్తే నెట్ రన్ పెరిగి టాప్ ఫోర్ లో నిలవొచ్చు. ఢిల్లీకి మాత్రం ఈ మ్యాచ్ గెలిచినా.. మిగతా జట్ల గెలుపొటములపైనే ఆధారపడాల్సిన పరిస్థితి.

Exit mobile version