YS Jagan : ఆ విషయంలో మోదీకే సపోర్ట్ చేస్తా..జగన్ సంచలన వ్యాఖ్యలు

YS Jagan

YS Jagan

YS Jagan : లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల తేదీ దగ్గర పడుతోంది. మే 13న ఎన్నికలు నిర్వహించి జూన్ 4న ఫలితాలు వెల్లడించనున్నారు.  ఆంధ్రప్రదేశ్ లోని 175 అసెంబ్లీ, 25 లోక్ సభ స్థానాలకు పోలింగ్ జరగనుంది. అన్ని పార్టీలు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నాయి.

2019 నాటి ఎన్నికల్లో సాధించిన పట్టు నిలుపుకోవాలని వైసీపీ భావిస్తోంది. ఈ మేరకు కార్యాచరణ రూపొందించుకుంది. 151-22 సీట్లు గెలుచుకోవాలని పథకాలు వేస్తోంది. జగన్ చివరి విడత ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్ షోలు నిర్వహిస్తున్నారు.  టైమ్స్ నౌ న్యూస్ చానల్ కు ఇంటర్వ్యూలో రాష్ట్ర రాజకీయాలపై జగన్ తన మనసులోని మాట వ్యక్తం చేశారు. ఎన్నికల మేనిఫెస్టో గురించి వివరించారు.

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడం లేదని చెప్పారు. నరేంద్ర మోదీ అయినా రాహుల్ గాంధీ అయినా రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేస్తే తప్పకుండా మద్దతు ఇస్తానని పేర్కొన్నారు. ప్రాంతీయ పార్టీ అయినా జాతీయ స్థాయిలో ప్రభావితం చేసే అంశాలకు మద్దతు ఇస్తామని ప్రకటించారు. ప్రస్తుతం ఏ పార్టీతోనూ పొత్తు లేదని స్పష్టం చేశారు.

ఒకే దేశం, ఒకే ఎన్నిక నినాదానికి మద్దతు ఇస్తానన్నారు. మైనార్టీల విషయంలో కేంద్రం వ్యవహరిస్తున్న తీరును తప్పుబట్టారు. కాంగ్రెస్ నేతలే తనను జైలుకు పంపారని గుర్తు చేసుకున్నారు. రాహుల్ గాంధీ నిష్పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని అనుకోవడం లేదని వ్యాఖ్యానించారు. కేంద్రంలో ఎవరు అధికారంలోకి వచ్చినా ప్రజల కోసం పనిచేసే వారికి మద్దతు ఉంటుందన్నారు. చంద్రబాబు తన చెల్లెలు షర్మిల, కుటుంబ సభ్యులను ప్రభావితం చేశారని YS Jaganగుర్తు చేశారు. ఆయన ఆడే గేమ్ లో పావులుగా మారారన్నారు. వారిని తనపై తిరుగుబాటు చేయించి మైండ్ గేమ్ ఆడుతున్నారని చెప్పుకొచ్చారు. వీటిని తాను పట్టించుకోనని పేర్కొన్నారు.

TAGS