Soft director : సాఫ్ట్ దర్శకుడని తక్కువగా అంచనా వేశారు..  కట్ చేస్తే పరభాషా హీరోలకు సూపర్ హిట్లు!

Soft director

Soft director

soft director : తెలుగు దర్శకులను తెలుగు హీరోలే నమ్మడం లేదనే అపవాదు ఎప్పటి నుంచో ఉన్నది. తాము చెప్పిన కథను మరో  తమిళ డైరెక్టరో, మలయాళ డైరెక్టరో చెబితే వెంటనే సినిమా చేస్తారని, డేట్లు అడ్జెస్ట్ చేయడంతో పాటు నిర్మాతలను కూడా వెతికి పెడతారని పలువురు దర్శకులు గతంలో బాహాటంగానే విమర్శించారు. కొన్ని సినిమాల్లో ఓ తమిళ డైరెక్టర్ వచ్చి తెలుగు హీరోకు  కథ చెప్పగానే ఓకే చెప్పే సీన్లు కూడా ఉన్నాయి. అది మన తెలుగు హీరోల వైఖరికి అద్దం పడుతున్నది. తెలుగులో ఎంతో మంది టాలెంటెడ్ డైరెక్టర్లు, టెక్నీషియన్లు ఉన్నా వాళ్లను అంచనా వేయడంతో వెనుకబడి పోతున్నారు. ఇప్పుడు కూడా ఓ తెలుగు దర్శకుడిని నమ్మడంతో విఫలమై హిట్లు పోగోట్టుకున్నారు.

టాలీవుడ్ లో నటుడిగా పరిచయమై ఆ తర్వాత కథా రచయితగా, మాటల రచయితగా అక్కడి నుంచి దర్శకుడిగా మారాడు వెంకీ అట్లూరి. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తో తొలిప్రేమ సినిమా చేసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. ఆ తర్వాత అక్కినేని అఖిల్ తో చేసిన మిస్టర్ మజ్ను అంతగా ఆడలేదు. నితిన్ తో రంగ్ దే పరవాలేదనిపించుకుంది.

ఆ తర్వాతే తనలోని అసలైన రచయిత, దర్శకుడు బయటకు వచ్చాడు. తొలి మూడు సినిమాలకు భిన్నమైన కథలను ఎంచుకొని సినిమాలు చేశాడు. ఈ కొత్త తరహా కథలను మన తెలుగు హీరోలకు ఎక్కలేదు. సార్ సినిమా కథను ముందుగా నాగ చైతన్యకు వినిపించగా ఇంట్రెస్ట్ చూపించలేదు. ఈ సినిమా కాస్త తమిళ స్టార్ హీరో ధనుష్ కు చేరింది. ఈ సినిమా రెండు భాషల్లో హిట్టయ్యింది. ఇక లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ లక్కీ భాస్కర్ లో హీరో దుల్కర్ సల్మాన్. ఈ సినిమా కూడా మలయాళం, తెలుగులో సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతున్నది. అయితే ఈ సినిమా కథను ముందుగా హీరో నానికి వినిపించగా పెద్దగా పట్టించుకోలేదు. దీంతో వెంకీ అట్లూరి దుల్కర్ ను కలిశాడు. దుల్కర్ వెంటనే ఓకే చేయడం, సినిమా పట్టాలెక్కడం చకచకా జరిగిపోయాయి. కట్ చేస్తే సూపర్ హిట్లు.

ఇలా ఇద్దరు తెలుగు హీరోలు సాటి తెలుగు దర్శకుడి ప్రతిభను నమ్మలేకపోయారు. ఫలితంగా రెండు సూపర్ హిట్లు తమిళ, మలయాళ హీరోలు ఎగరేసుకుపోయారు.

TAGS